Sharwanand Bhogi: ఫుల్ స్వింగ్ లో శర్వా ‘భోగి’ క్లైమాక్స్ షూటింగ్.. రిలీజ్ ఎప్పుడంటే..?

హీరో శర్వానంద్ తాజా చిత్రం ‘భోగి’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో ఆయన కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు సంపత్ నంది, శర్వానంద్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

New Update
Sharwanand Bhogi

Sharwanand Bhogi

Sharwanand Bhogi: హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో ఆయన కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు. దర్శకుడు సంపత్ నంది, శర్వానంద్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లతో మంచి రెస్పాన్స్ అందుకుంది.

ప్రస్తుతం మూవీ టీమ్ క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణలో బిజీగా ఉంది. ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఎమోషన్స్, యాక్షన్‌తో నిండిన క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ఈ సెట్‌ను రూపొందించగా, ప్రముఖ ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేశారు.

సినిమాలో అత్యంత కీలకమైన ఈ క్లైమాక్స్ కోసం శర్వానంద్ కఠినమైన స్టంట్లు చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ షెడ్యూల్ దాదాపు 20 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తోంది. 1960ల కాలం నేపథ్యంలో సాగే ఈ కథ తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఒక కల్పిత గ్రామాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. గ్రామీణ జీవితం, బలమైన ఎమోషన్స్, భారీ పోరాటాలతో కూడిన పీరియడ్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండనుంది.

సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘భోగి’ చిత్రం ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
తాజా కథనాలు