Bhanumathi: దర్శకుడి చెంప చెల్లుమనిపించిన అలనాటి స్టార్ హీరోయిన్! ఎందుకంటే..?

భానుమతి 1925లో జన్మించి, తెలుగు సినిమాల్లో నటిగా, గాయకురాలిగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా, రచయిత్రిగా, నిర్మాతగా సక్సెస్ సాధించింది. ఆమె ధైర్యం, వ్యక్తిత్వం, నటన ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టి భారతీయ సినీ గౌరవాన్ని అందించాయి.

New Update
Bhanumathi

Bhanumathi

Bhanumathi: భానుమతి భారతదేశంలో ఎవరికీ లభించని ప్రత్యేక గౌరవాన్ని పొందిన ఒక టాలెంటెడ్ హీరోయిన్. టాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరుపొందిన ఆమె, కేవలం గొప్ప నటి మాత్రమే కాదు, ధైర్యం, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కూడా.

కెరీర్ మొదట్లో..

భానుమతి 1925 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య సంగీత కళాకారుడు. భానుమతి చిన్నప్పటి నుంచే తండ్రి వద్ద నుంచి సంగీతాన్ని నేర్చుకుంది. 14 ఏళ్ల వయసులోనే ఆమెకు “వరవిక్రయం” సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నటించడానికి తండ్రి కొన్ని షరతులు పెట్టారు: మేల్ యాక్టర్స్ ఆమెను హ్యాండ్‌ల్ చేయకూడదు, హగ్ లేదా కిస్ లాంటి సన్నివేశాలు ఉండకూడదు. ఈ షరతులను సినిమా టీమ్ అంగీకరించడంతో భానుమతి సినిమాల్లోకి అడుగుపెట్టింది.

సినీ కెరీర్

భానుమతి నటిగా, గాయకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రిగా, స్టూడియో ఓనర్‌గా అన్ని విభాగాల్లో ప్రావీణ్యం చూపింది. సినిమాల్లో నటిస్తూ పాటలు పాడుతూ, సంగీతాన్ని కంపోజ్ చేస్తూ ఆకట్టుకుంది. 19వ ఏట రైటర్‌గా పరిచయం కావడం విశేషం. ఆమె “అత్తగారి కథలు” రచనకు పద్మశ్రీ అవార్డు లభించింది.

ధైర్యం, వ్యక్తిత్వం

భానుమతి ఎవరికీ భయపడని వ్యక్తి. ఓసారి షూటింగ్ సమయంలో ఒక తమిళ దర్శకుడు ఆమెను "భానుమతి ఇలా రావే" అని  పిలవగా, భానుమతి "ఏంట్రా అన్నావ్ ..?" ఆ దర్శకుడి చంప చెల్లుమనిపించిన్చదట. ఈ ధైర్యానికి కారణంగానే ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు వచ్చింది.

సినిమాల్లో అవకాశాలు

ముఖ్యంగా "మిస్సమ్మ" సినిమాలో హీరోయిన్ పాత్ర పొందకపోయినా, భానుమతి దానికి బాధపడలేదు. ఆమె సంతృప్తిగా భావించింది, తన స్థానంలో సావిత్రి వంటి నటి అవకాశాన్ని పొందినందుకు. హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసిన తర్వాత, ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించింది. తాతమ్మకల, గడసరి అత్త సొగసరి కోడలు, మంగమ్మగారి మనవడు, బామ్మమాట బంగారు బాట వంటి సినిమాల్లో ఆమె నటనా ప్రతిభ చూపింది.

అవార్డులు

భానుమతి కెరీర్‌లో మూడు నేషనల్ అవార్డులు, పద్మశ్రీ అవార్డు, కలైమామణి అవార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులు లభించాయి. ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలు డాక్టరేట్లతో ఆమెను సత్కరించాయి.

మరణం

ఆమె చివరి సినిమా "పెళ్లికానుక" 1998లో విడుదలైంది. 80 ఏళ్ల వయసులో 2005 డిసెంబర్ 24న భానుమతి కన్నుమూశారు. తన బహుముఖ ప్రతిభ, ధైర్యం, సంపూర్ణ వ్యక్తిత్వం వల్ల ఆమెకు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా లేని గౌరవం లభించింది.

#bhanumathi
Advertisment
తాజా కథనాలు