Sara Tendulkar: సిగ్గు లేదు మీ అందరికీ.. ఎవడైనా ఇలాంటి రాతలు రాస్తాడా..? సారా టెండూల్కర్ ఫైర్!
సారా టెండూల్కర్ పై అవమానకరమైన క్యాప్షన్‌తో పోస్ట్ వైరల్ కావడంతో ఆమె తీవ్రంగా స్పందించింది. ఇది జర్నలిజం కాదని, సెలబ్రిటీల ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని చెప్పింది. ఈ ఘటనతో ఇలాంటి కల్చర్, ఆన్‌లైన్ హరాస్మెంట్, మీడియా బాధ్యతపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది.
/rtv/media/media_files/2026/05/22/sara-tendulkar-2026-05-22-06-58-17.jpg)
Sara Tendulkar
Sara Tendulkar: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే కల్చర్‌పై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఈసారి ఈ వివాదానికి కారణం సారా టెండూల్కర్ Sara Tendulkar. ఆమె ఎయిర్‌పోర్ట్‌కు తన సిస్టర్-ఇన్-లా తో కలిసి వచ్చిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ వీడియోకు అవమానకరంగా, బాడీ షేమింగ్ చేసేలా క్యాప్షన్ పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ పోస్ట్ చూసి సోషల్ మీడియాలో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని ఇంతలా టార్గెట్ చేయడం సరైంది కాదని నెటిజన్లు కామెంట్లు చేశారు. ముఖ్యంగా మహిళలపై ఇలా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తప్పు అని పలువురు పేర్కొన్నారు.
A journalist named Tahir Jasus made a video of Sara Tendulkar at an Airport and made objectionable objectionable comment about her and her sister-in-law.
— Incognito (@Incognito_qfs) May 21, 2026
Sara Tendulkar called him out over his creepy behaviour. He has deleted that video.
People like Tahir are just not worthy of… pic.twitter.com/lZ4uUx4F3O
ఈ ఘటనపై స్పందించిన సారా టెండూల్కర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ అకౌంట్‌ను నేరుగా ట్యాగ్ చేస్తూ తీవ్రంగా విమర్శించింది. “ఇది జర్నలిజం కాదు. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి” అంటూ చెప్పింది. ఆమె చేసిన ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంతేకాకుండా, ఆ అవమానకరమైన పోస్ట్ తర్వాత డిలీట్ చేసినా, దాంతో జరిగిన నష్టం తగ్గిపోదని సారా పేర్కొంది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారికి కూడా గౌరవం, ప్రైవసీ అవసరమే అని ఆమె తెలిపింది.
ఈ సంఘటన తర్వాత మరోసారి ఈ కల్చర్, మీడియా ఎథిక్స్, ఆన్‌లైన్ హరాస్మెంట్ వంటి విషయాలపై పెద్ద చర్చ మొదలైంది. చాలా మంది సారా ధైర్యంగా స్పందించిన విధానాన్ని ప్రశంసించారు. ఇలాంటి అనవసరమైన, అవమానకరమైన కవరేజ్‌ను ప్రశ్నించడం అవసరమని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సంస్కృతి మొదట్లో ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీలు ప్రోత్సహించారనే మాటలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసం, ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు కొందరు సెలబ్రిటీలు మీడియా దృష్టిని కోరుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు అదే వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం, హద్దులు దాటడం, సెన్సిటివిటీ లేకుండా ప్రవర్తించడం వంటి కారణాలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.
సారా టెండూల్కర్ ఘటనతో మరోసారి ఈ విషయం స్పష్టమైంది. సెలబ్రిటీలు అయినా, సాధారణ వ్యక్తులు అయినా గౌరవం అందరికీ సమానంగా ఉండాలి. సోషల్ మీడియా, డిజిటల్ జర్నలిజంలో బాధ్యతతో వ్యవహరించడం ఇప్పుడు చాలా అవసరంగా మారింది.
Follow Us