/rtv/media/media_files/2026/04/29/samantha-birthday-2026-04-29-11-25-25.jpg)
Samantha Birthday
Samantha Birthday: నటి సమంతా రూత్ ప్రభు Samantha Ruth Prabhu తన 39వ పుట్టినరోజును చాలా సింపుల్‌గా, అభిమానుల మధ్య జరుపుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె ఇలా పబ్లిక్‌గా ఫ్యాన్స్‌తో కలవడం ప్రత్యేకంగా మారింది. పసుపు రంగు చీరలో కనిపించిన సమంత, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి వారితో మాట్లాడారు. ఈ వేడుక చాలా భావోద్వేగంగా, గుర్తుండిపోయేలా జరిగిందని అభిమానులు తెలిపారు.
Samantha Birthday Celebration with fans ❤️#Samantha#Kalakkalcinemapic.twitter.com/WNiNlJHdFd
— Kalakkal Cinema (@kalakkalcinema) April 29, 2026
ఇటీవలి కాలంలో ఎక్కువగా పబ్లిక్ ఈవెంట్స్‌కి దూరంగా ఉన్న సమంత, ఈసారి మాత్రం తన అభిమానులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఆమెకు అభిమానులతో ఉన్న అనుబంధం ఈ వేడుకలో స్పష్టంగా కనిపించింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, సమంత మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా "మా ఇంటి బంగారం" Maa Inti Bangaram షూటింగ్ ఇప్పటికే పూర్తవుతోంది. ఈ సినిమా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆమె రీ ఎంట్రీగా భావిస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం నందిని రెడ్డి Nandini Reddy వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా బృందం విడుదల చేసిన బీహైండ్ ది సీన్స్ వీడియోలో సమంత డెడికేషన్‌ను చూపించారు. షూటింగ్ సమయంలో ఆమె బాడీ డబుల్ లేకుండా స్వయంగా యాక్షన్ సీన్స్ చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది.
సినిమా యాక్షన్‌తో పాటు ఎమోషనల్ అంశాలతో కూడా ఉండబోతుందని సమాచారం. సమంతను ఒక కొత్త, బలమైన పాత్రలో చూపించనున్నారని టీమ్ చెబుతోంది.
ఈ సినిమాను సమంత కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపుగా భావిస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా మే 15న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Follow Us