/rtv/media/media_files/2025/01/17/wUAKvmfqCg9VeKi1XDYx.jpg)
sam cs bgm pushpa2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ గత ఏడాది చివర్లో విడుదలై ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1840 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. సినిమా ఇంత పెద్ద సక్సెస్ కు సుకుమార్ టేకింగ్, బన్నీ యాక్టింగ్ తో పాటూ మ్యూజిక్ అండ్ బీజియం కూడా ప్రధాన కారణం.
అయితే ఈసినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేశారు. ఒకరు దేవిశ్రీప్రసాద్ మరొకరు సామ్ సీఎస్. DSP సాంగ్స్ కంపోజ్ చేస్తే.. సామ్ సీఎస్ 90% బీజియం వర్క్ చేశాడట. రీసెంట్ టైమ్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పారు. కానీ అప్పుడు చాలామంది నమ్మలేదు. అయితే తాజాగా మాత్రం ఆయన ప్రూఫ్స్ తో సహా చూపించారు. ఓ కోలీవుడ్ మీడియా ఆయన స్టూడియోలోనే ఇంటర్వ్యూ చేసింది.
Sam CS Live BGM Composing ❤️🔥
— Sumanth (@SumanthOffl) January 16, 2025
MENTALoda 🤯🫡🫡🫡💥#Pushpa2TheRule @alluarjun pic.twitter.com/oha807cloM
అందులో సామ్ సీఎస్ లైవ్ లో 'పుష్ప2' బీజియం కంపోజ్ చేశారు. అలాగే ఆ బీజియం వెనుక స్టోరీని కూడా యాంకర్ తో పంచుకున్నారు. విశేషం ఏమిటంటే స్టూడియోలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తో పాటూ తన గొంతుతో కూడా ఓ సౌండ్ ఇస్తూ దాన్ని బీజియం లాగా మార్చారు. దాన్ని అలాగే సినిమాలో పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
సామ్ సీఎస్ లైవ్ కంపోజింగ్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు ఈ వీడియో ద్వారా 'పుష్ప2' సాంగ్స్ ను DSP కంపోజ్ చేస్తే, సామ్ సీఎస్ బీజియం ఇచ్చారని ఓ క్లారిటీకి వచ్చారు. అన్నట్లు 'పుష్ప2' లో 'గంగమ్మ తల్లి జాతర' సాంగ్ ను కంపోజ్ చేసింది కూడా సామ్ సీఎస్సేనట.