Salaar Part 2: 'సలార్ 2'పై ప్రశాంత్ నీల్ క్రేజీ అప్‌డేట్.. షూటింగ్ స్టార్ట్ అప్పటినుండే!

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం డ్రాగన్ పై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ సినిమా తర్వాత వెంటనే సలార్ పార్ట్ 2 ప్రారంభమవుతుందని క్లారిటీ ఇచ్చారు. K.G.F: Chapter 3కు ఇంకా సమయం పడుతుందని చెప్పారు. ప్రభాస్, ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ అప్డేట్ జోష్ పెంచుతోంది.

New Update
Salaar Part 2

Salaar Part 2

Salaar Part 2: డ్రాగన్ Dragon సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా Jr NTR అభిమానులు ఈ వీడియోను భారీగా షేర్ చేయడంతో డిజిటల్ వ్యూస్ వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ దాదాపు 100 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ Prashanth Neel మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ‘డ్రాగన్’ సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు. అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం Salaar Part 2: Shouryaanga Parvam గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

‘డ్రాగన్’ సినిమా పూర్తయ్యాక తన తదుపరి ప్రాజెక్ట్ ‘సలార్ 2’నే అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. దీంతో Prabhas అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక K.G.F: Chapter 3 గురించి కూడా ప్రశాంత్ నీల్ స్పందించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌పై ఎలాంటి పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. తాను, Yash ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నామని, అందువల్ల ‘కేజీఎఫ్ 3’ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపారు.

‘డ్రాగన్’ సినిమా జూన్ 11, 2027న విడుదల కానుంది. అదే సమయానికి ప్రభాస్ కూడా Spirit షూటింగ్ పూర్తి చేసే అవకాశముంది. ఈ సినిమా మార్చి 5, 2027న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ లెక్కన చూస్తే, ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ 2027 మధ్యలో ‘సలార్ 2’ పనులు ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌ను Hombale Films నిర్మించనుంది. ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు