Sai Pallavi EK DIN: డిజాస్టర్ గా సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ!

సాయి పల్లవి బాలీవుడ్‌లో చేసిన తొలి సినిమా ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మారింది. మూడు రోజుల్లో అతి తక్కువ కలెక్షన్లు సాధించింది. వీక్ స్టోరీ, ప్రమోషన్ సరిగ్గా లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది.

New Update
Sai Pallavi EK DIN

Sai Pallavi EK DIN

Sai Pallavi EK DIN: సాయి పల్లవి Sai Pallavi గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజమైన నటనతో, గ్లామర్‌కు దూరంగా ఉండి మంచి కథలనే ఎంచుకుంటూ ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సరితూగే స్థాయిలో అభిమానులను సంపాదించిన ఆమె తాజాగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

మే 1న ఆమె మొదటి హిందీ సినిమా ‘ఏక్ దిన్’ విడుదలైంది. ఈ సినిమాలో జునైద్ ఖాన్ Junaid Khan హీరోగా నటించగా, అమీర్ ఖాన్ Aamir Khan నిర్మించారు. ఈ సినిమా మీద ముందుగా మంచి అంచనాలు ఉన్నాయి. సాయి పల్లవి బాలీవుడ్‌లో కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని అందరూ భావించారు.

కానీ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి రోజే కేవలం 1.37 కోట్ల వసూళ్లతో ప్రారంభమైంది. రెండో రోజు కలెక్షన్లు మరింత తగ్గి కోటి రూపాయల వరకు పడిపోయాయి. మూడో రోజు పరిస్థితి ఇంకా బలహీనంగా మారింది.

మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 3.88 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఈ స్థాయి కలెక్షన్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లు కూడా చాలా తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దక్షిణాదిలో సాయి పల్లవి పేరు చెప్పగానే థియేటర్లు నిండిపోతాయి. కానీ హిందీ ప్రేక్షకుల నుంచి ఆమెకు ఆశించిన స్థాయి స్పందన రాలేదు. కథ బలహీనంగా ఉండటం, సరైన ప్రమోషన్స్ లేకపోవడం ఈ సినిమా ఫ్లాప్‌కు కారణాలుగా చెప్పుకుంటున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘ఒక రోజు’ పేరుతో విడుదల చేసినా పెద్దగా ప్రచారం జరగలేదు.

మొత్తానికి సాయి పల్లవి తన బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే పెద్ద నిరాశను ఎదుర్కొంది. వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న ఆమెకు ఈ సినిమా ఒక బ్రేక్ లా మారింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఇక ఇప్పుడు ఆమె ఆశలు అన్ని రామాయణ Ramayana సినిమాపైనే ఉన్నాయి. ఇందులో రణ్‌బీర్ కపూర్‌ Ranbir Kapoorతో కలిసి నటిస్తున్న సాయి పల్లవి, ఈ సినిమాతో తిరిగి మంచి విజయాన్ని అందుకుంటుందా అన్నది చూడాలి.

Advertisment
తాజా కథనాలు