Varanasi Sets: నెక్స్ట్ లెవెల్ లో రాజమౌళి 'వారణాసి' షూటింగ్ సెట్స్! అసలు ఏం ప్లాన్ చేసావ్ జక్కన్న?

దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీలోని వారణాసి నగర మినియేచర్ సెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.

New Update
Varanasi Sets

Varanasi Sets

Varanasi Sets: దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి(Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో రూపొందుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ ప్రస్తుతం సెన్సేషనల్ టాపిక్‌గా మారింది. RRR తరువాత, రాజమౌళి ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించడానికి భారీ ప్లాన్‌లో ఉన్నారు.

1300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు, అంతర్జాతీయ VFX కంపెనీలు పని చేస్తున్నారు. సంగీతం ఎం.ఎం. కీరవాణి, హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు.

Also Read: 'ధురంధర్ 2' మేకింగ్ హిస్టరీ.. వీక్‌డేస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్!

కథా నేపథ్యానికి వస్తే, ‘వారణాసి’ ఒక గ్లోబ్- ట్రాటింగ్ యాక్షన్- అడ్వెంచర్. ఇండియానా జోన్స్ తరహాలో సాహసాలు చేస్తూ మహేష్ బాబు ప్రపంచం అంతటా ప్రయాణిస్తూ ఉంటాడు. కథలో ఆఫ్రికా అడవులు, పురాణాల హనుమంతుడి అంశాలు కీలకంగా ఉంటాయని టాక్ ఉంది. మహేష్ బాబు కొత్త లుక్‌లో పొడవాటి జుట్టు, గడ్డం, ప్రత్యేక శిక్షణతో చూపించనున్నారు.

తాజాగా, సినిమా కోసం రూపొందించిన వారణాసి నగర మినియేచర్ సెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీధులు, ఆలయాలు, ఇరుకైన చోట్లను రియలిస్టిక్‌గా రూపొందించటం అభిమానులను ఆకట్టుకుంటోంది. రాజమౌళి విజన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సినిమా యూనిట్ ఇప్పటికే ఆఫ్రికా, జార్జియా షెడ్యూల్స్ పూర్తి చేసి, ప్రస్తుతం కాశీ సెట్స్‌లో షూట్ చేస్తోంది. ఇక్కడ కీలక సీక్వెన్స్‌లు, భారీ యాక్షన్ షూట్ జరుగనుంది. తర్వాత అంటార్కిటికా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో షూటింగ్ జరగనుంది.

‘వారణాసి’ టాలీవుడ్ మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో ఇండియన్ సినిమాకు మరో మైలురాయిగా మారనుంది. టైటిల్ గ్లింప్స్‌తో ఇప్పటికే భారీ హైప్ సృష్టించారు. మేకర్స్ ప్రకటించినట్లుగా, సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు