'కాంతారా' తర్వాత హిస్టారికల్ బయోపిక్‌ తో రిషబ్ శెట్టి ఎంట్రీ

'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. మరాఠా వీరుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌' బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ తెరకెక్కిస్తున్నారు.

New Update
RISHAB SHETTY

RISHAB SHETTY

RISHAB SHETTY: కన్నడ హీరో రిషబ్ శెట్టి  'కాంతారా' సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. అయితే  కాంతారా సక్సెస్ తర్వాత రిషబ్ మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ రిలీజ్ చేశారు. 

'ఛత్రపతి శివాజీ మహారాజ్'

సందీప్‌ సింగ్‌ దర్శకత్వంలో రిషబ్  'ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమా అనౌన్స్ చేశారు. ఇందులో రిషబ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించబోతున్నారు. "ఇది కేవలం సినిమా కాదు.. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యం   శక్తిని సవాలు చేసిన ధీరుడు, ఎప్పటికీ మరచిపోలేని వారసత్వాన్ని సృష్టించిన ఒక యోధుడిని గౌరవించటానికి ఇది ఒక యుద్ధ నినాదం. ఎపిక్ సాగా ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ వారియర్ కింగ్ - ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గర్వం"  అంటూ ఎక్స్ లో  పోస్టర్ రిలీజ్ చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు