/rtv/media/media_files/2025/03/22/NyEiypKerRoeohlS9ypX.jpg)
Ravi Teja
Ravi Teja: కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన "MAD" సినిమా చిన్న మూవీగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ కి మూవీ లవర్స్ ఇంకా యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. MAD సూపర్ సక్సెస్ తో దానికి సీక్వెల్ గా కల్యాణ్ శంకర్ "MAD స్క్వేర్" ను కూడా సిద్ధం చేసారు. ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది, ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..
అయితే తాజా సమాచారం ప్రకారం, కల్యాణ్ శంకర్ మూడో సినిమా కూడా పట్టాలెక్కిస్తున్నారట. ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రవితేజ కోసం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఈ మూవీ ఒక సూపర్ హీరో కథతో తెరకెక్కబోతొందట. ఆల్రెడీ కథను రవితేజకు వినిపించగా, రవితేజ కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. అయితే, టాలీవుడ్‌లో ప్రస్తుతం సూపర్ హీరో కథలకు మంచి డిమాండ్ ఉంది. యంగ్ హీరో తేజా సజ్జా "హనుమాన్", "మిరాయ్" ఇలా ఒకదాని తరువాత ఒకటి వరుసగా సూపర్ హీరో మూవీస్ చేస్తున్నాడు. ఇదే దారిలో ఇప్పుడు రవితేజ కూడా సూపర్ హీరోగా మారబోతున్నాడు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
"అనార్కలి" మూవీకు గ్రీన్ సిగ్నల్
మొదట 2026 సంక్రాంతి రిలీజ్ అనుకున్నప్పటికీ, ఈ సినిమా ప్రీప్రోడుక్షన్ పూర్తి కావడానికే చాలా టైమ్ పడుతుండటంతో, సినిమా షూట్ ని 2025 ఆగస్ట్ లో స్టార్ట్ చేసి, 2026 చివరల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దాని తరువాత "అనార్కలి" అనే మరొక మూవీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. ఈ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొంతొంది. "మాస్ జాతర" విషయానికొస్తే ఇది కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనే రూపొందుతుండడం విశేషం అంటే రవితేజ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో చేసే ఛాన్సెస్ ఉన్నాయనే చెప్పాలి. అన్ని కుదిరితే 2026 లో రెండు సినిమాలతో పలకరించనున్నాడు రవి తేజ.
Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!