/rtv/media/media_files/2026/05/27/irumudi-release-2026-05-27-20-56-39.jpg)
Irumudi Release
Irumudi Release: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త సినిమా ‘ఇరుముడి’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా, చిత్రబృందం సినిమాను 2026 ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే అదే ఆగస్టు నెలలో నాని, శర్వానంద్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. దీంతో ఆ నెల టాలీవుడ్‌లో భారీ పోటీ నెలకొననుంది.
‘ఇరుముడి’ సినిమా షూటింగ్‌లో ఒక కీలక షెడ్యూల్ త్వరలో పూర్తికానుంది. ఆ తర్వాత ప్రమోషన్స్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సినిమా మొదటి పాట ‘మల్లె పూల పల్లకి’ను త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్‌ను ‘పెద్ది’ సినిమా విడుదల తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి సంగీతం జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. హీరోయిన్‌గా ప్రియా భవాని శంకర్ నటిస్తోంది.
కోస్తాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎమోషన్స్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ రెండూ ఉండేలా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
మొదటిసారి రవితేజ - శివ నిర్వాణ కాంబినేషన్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది.
Follow Us