/rtv/media/media_files/2026/05/01/peddi-release-date-2026-05-01-11-34-49.jpg)
Peddi Release Date
Peddi Release Date: రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా గ్రామీణ క్రీడల నేపథ్యంతో రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారు, అయితే ముందుగానే విడుదల చేసే అవకాశమూ ఉంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి మూవీ టీమ్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనున్నారు.
Also Read: ప్రభాస్ “ఫౌజీ”కి ప్రీక్వెల్ ప్లాన్స్.. ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా!
#GetReadyForPeddi
— PEDDI (@PeddiMovieOffl) May 1, 2026
Exciting updates starting from today ❤️🔥#Peddi release date announcement press meet today from 4 PM onwards
▶️ https://t.co/OF53uhkAVCpic.twitter.com/QZVIjbUXdn
ఇటీవల హైదరాబాద్‌లో భారీ సెట్లో రామ్ చరణ్, శృతి హాసన్ పై ఒక ప్రత్యేక పాటను చిత్రీకరించారు. ఈ షూటింగ్ పూర్తైన తర్వాత సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందిస్తూ, “పెద్ది” తనకు ఒక మంచి అనుభవమని చెప్పారు. రామ్ చరణ్ గొప్ప నటుడని, మంచి స్నేహితుడని ఆయన ప్రశంసించారు.
షూటింగ్ పూర్తవడంతో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Follow Us