Peddi Run Time: వామ్మో.. రామ్ చరణ్ పెద్ది షాకింగ్ రన్‌టైమ్.. మరీ అన్ని గంటలా..?

రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ జూన్ 4న విడుదల కానుంది. బుచ్చి బాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా రన్‌టైమ్ 3 గంటలు దాటొచ్చని టాక్ నడుస్తోంది. గ్రామీణ క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

New Update
Peddi Run Time

Peddi Run Time

Peddi Run Time: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా నటిస్తున్న భారీ సినిమా పెద్ది Peddi పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు బుచ్చిబాబు సానా Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీ హైప్ కనిపిస్తోంది.

ఇటీవల మూవీ టీమ్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. మే 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ‘పెద్ది’ సినిమా దాదాపు 3 గంటల 10 నిమిషాల నిడివితో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అంటే మొత్తం 190 నిమిషాల పాటు సినిమా ఉండే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. సెన్సార్ పూర్తి అయిన తర్వాత అసలు రన్‌టైమ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read: ‘కాంచన 4’తో రాఘవ లారెన్స్ హిట్ ఫ్రాంచైజీకి ది ఎండ్.. ఎమోషన్ అవుతోన్న ఫ్యాన్స్‌!

ఇటీవల పెద్ద సినిమాలకు ఎక్కువ నిడివి ఉండటం కామన్‌గా మారింది. ప్రేక్షకులను బలమైన కథతో, ఎమోషన్స్‌తో కట్టిపడేస్తే లాంగ్ రన్‌టైమ్ కూడా పెద్ద సమస్య కాదని మేకర్స్ భావిస్తున్నారు. ‘పెద్ది’ విషయంలో కూడా అదే ప్లాన్‌లో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలోని క్రికెట్ టోర్నమెంట్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా సినిమాలో ముఖ్యంగా ఉండబోతున్నాయని మూవీ టీమ్ చెబుతోంది. ప్రేక్షకులు పాత్రలతో బాగా కనెక్ట్ అయ్యేలా కథను రూపొందించారని సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ Janhvi Kapoor నటిస్తోంది. అలాగే కీలక పాత్రల్లో శివ రాజ్‌కుమార్ Shiva Rajkumar, జగపతి బాబు Jagapathi Babu, దివ్యేందు శర్మ Divyenndu Sharma, బోమన్ ఇరానీ Boman Irani కనిపించనున్నారు. సంగీతాన్ని A. R. Rahman అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలని అనుకున్నారు. తర్వాత ఏప్రిల్ 30కు వాయిదా వేసి, చివరికి జూన్ 4 రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు.

Also Read: ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ ప్లాన్‌తో వస్తున్న రామ్ చరణ్!

ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. చివరి షెడ్యూల్‌లో భాగంగా ఓ ప్రత్యేక సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో శృతి హాసన్ Shruti Haasan స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వొచ్చని టాక్ నడుస్తోంది. ముందు ఈ పాటలో మృణాల్ ఠాకూర్ Mrunal Thakur కనిపిస్తారని ప్రచారం జరిగినా, ఇప్పుడు శృతి హాసన్ పేరు వినిపిస్తోంది.

‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ Sukumar తో కొత్త సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం RC17 పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Advertisment
తాజా కథనాలు