Peddi Story: 'పెద్ది' ప్లాట్ ట్విస్ట్ రివీల్ చేసిన మున్నా భయ్యా.. ఫ్యాన్స్ కు ఊహించని సర్‌ప్రైజ్!

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో తన పాత్ర, దివ్యేందు శర్మ పాత్ర మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. తనను రామ్ బుజ్జి ఎప్పుడూ గుర్తించకూడదనేలా కథ ఉంటుందని తెలిపారు. దివ్యేందు తనది జమీందార్ కుమారుడి పాత్ర అని చెప్పారు. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.

New Update
Peddi Story

Peddi Story

Peddi Story: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూలో దివ్యేందు శర్మ తన పాత్ర గురించి, అలాగే రామ్ చరణ్ పాత్రతో ఉన్న సంబంధం గురించి వివరించారు. తన పాత్ర ‘రామ్ బుజ్జి’ దృష్టిలో రామ్ చరణ్ పాత్ర ‘పెద్ది’ కేవలం పనికి తీసుకున్న కూలీ మాత్రమేనని చెప్పారు. తన పాత్రకు పెద్ది మీద ఎలాంటి వ్యక్తిగత భావాలు లేవని స్పష్టం చేశారు. ఒక జమీందార్ కుమారుడిగా ఉన్న తన పాత్రలో ఆ అహంకారం, హోదా భావాన్ని చూపించాల్సి వచ్చిందని తెలిపారు.

ఇంకా రామ్ చరణ్ కూడా తన పాత్ర గురించి మాట్లాడారు. రామ్ బుజ్జి దృష్టిలో తాను ఎప్పుడూ కనిపించకూడదనేలా తన పాత్ర ఉంటుందని చెప్పారు. అంటే తన ఉనికి కూడా అతని దృష్టికి రావడం కథలో ముఖ్య అంశమని ఆయన వివరించారు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

‘పెద్ది’ సినిమాలో పాత్రల మధ్య ఉన్న ఈ ప్రత్యేక సంబంధం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Advertisment
తాజా కథనాలు