/rtv/media/media_files/2026/05/01/ott-movies-2026-05-01-12-19-00.jpg)
OTT Movies
OTT Movies: తెలుగు హారర్ కామెడీ సినిమా “రాకాస” థియేటర్లలో ఏప్రిల్ 3, 2026న విడుదలైంది. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మనస శర్మ తెరకెక్కించారు. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఈ సినిమా మంచి రెస్పాన్స్ సాధించింది.
ఇప్పుడు “రాకాస” ఓటీటీ లోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మొదట తెలుగు లో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. దీంతో మరింత మంది ప్రేక్షకులు ఈ సినిమాను చూడగలుగుతున్నారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి నటులు కీలక పాత్రల్లో నటించి కథకు కామెడీ బలం ఇచ్చారు. హారర్ అంశాలను కామెడీతో కలిపి ఈ సినిమా సరదాగా చూసేలా ఉంటుంది.
ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మంచి ఫీలింగ్ ఇచ్చింది. ఉమేష్ కుమార్ గుప్త ఈ ప్రాజెక్ట్‌కు సహ నిర్మాతగా పనిచేశారు.
ఇక మరోవైపు శర్వానంద్ నటించిన “బైకర్” సినిమా కూడా ఇప్పుడు ఓటీటీ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా భారతదేశంలో మొట్టమొదటి మోటోక్రాస్ క్రీడపై రూపొందిన చిత్రంగా చెబుతున్నారు. ఇందులో శర్వానంద్‌తో పాటు మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, డా. రాజశేఖర్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఈ సినిమాను అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇది కూడా ఏప్రిల్ 3, 2026న థియేటర్లలో విడుదలై, తన కొత్త కథతో కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు “బైకర్” కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకునే అవకాశం కలిగింది. ఈ సినిమాలో అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, శశాంక్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాకు జిబ్రాన్ సంగీతం అందించారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది.
Follow Us