/rtv/media/media_files/2026/04/18/jailer-2-ott-deal-2026-04-18-17-42-20.jpg)
Jailer 2 Big Update
Jailer 2 Big Update: సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న “జైలర్ 2” సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా మంచి అప్‌డేట్ వచ్చింది.
చిత్ర బృందం అధికారికంగా షూటింగ్ పూర్తయిందని ప్రకటించింది. షూటింగ్ ముగిసిన సందర్భంగా టీమ్ కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి వెళ్లింది.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మరీ ఇంత డిలేనా?
Alapparai Kelappurom, Thalaivaru Nerandharam! ⭐💥 It's a wrap for #Jailer2 😎@rajinikanth@Nelsondilpkumar@anirudhofficialpic.twitter.com/75kLIQBF4w
— Sun Pictures (@sunpictures) April 21, 2026
పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తయితే, సినిమా అనుకున్నదానికంటే త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంకా అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
Also Read:ENE Repeat మూవీ అప్‌డేట్.. చిల్ మోడ్ లో టీమ్ కన్యారాశి!
ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, ఎస్.జే. సూర్య, మోహన్‌లాల్, రమ్య కృష్ణన్, మీర్నా మీనన్, యోగి బాబు వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.
మొత్తంగా “జైలర్ 2” షూటింగ్ పూర్తవడంతో అభిమానులు ఇప్పుడు రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us