Rajamouli Varanasi: రాజమౌళి మార్కెటింగ్ అంటే ఇదే.. ఒక్క దెబ్బతో 'వారణాసి' పై ప్రపంచ దృష్టి!

రాజమౌళి - మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాకు ఒక్క ఫ్లెక్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు. వారణాసిలో పెట్టిన హోర్డింగ్ ద్వారా ఏప్రిల్ 7, 2027న రిలీజ్ అని సైలెంట్‌గా ప్రకటించారు. టైమ్ ట్రావెల్ కథతో యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

New Update
Rajamouli Varanasi

Rajamouli Varanasi

Rajamouli Varanasi: సినిమాకు హైప్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసిన డైరెక్టర్స్ లో భారతదేశంలో ఎస్.ఎస్. రాజమౌళికి మించిన దర్శకుడు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో సినిమా ప్రమోషన్‌లను కొత్త స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, మరోసారి తన మార్కెటింగ్ మైండ్‌ని చూపించారు.

గత ఏడాది నవంబర్‌లో తన కొత్త సినిమా ‘వారణాసి’ టైటిల్ లాంచ్ ఈవెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా సినిమాపై భారీ ఆసక్తి తీసుకొచ్చిన రాజమౌళి, ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Rajamouli Varanasi Release Date Banner

ఒక్క ఫ్లెక్స్.. అంతే!

అనూహ్యంగా రాజమౌళి, వారణాసి నగరంలో ఒక్క పెద్ద హోర్డింగ్ పెట్టించారు. ఆ ఫ్లెక్స్‌పై ఉన్నది ఒక్కటే లైన్ - “In Theatres April 7, 2027”

అందులో సినిమా పేరు లేదు, హీరో పేరు లేదు, దర్శకుడు పేరు కూడా లేదు. కానీ ఆ ఒక్క వాక్యం ఇప్పుడు దేశమంతా, విదేశాల్లో కూడా పెద్ద చర్చగా మారింది. పవిత్ర నగరమైన వారణాసిని ఎంచుకోవడం వల్ల సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ ఫ్లెక్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ అభిమానులు, మీడియా భారీగా స్పందించారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ సైలెంట్ ప్రమోషన్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. 

ఇప్పటివరకు సినిమా టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ఫ్లెక్స్ ద్వారా 2027 ఏప్రిల్ 7నే సినిమా రిలీజ్ డేట్ అని క్లారిటీ వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా, కొత్త పద్ధతిలో రిలీజ్ డేట్ చెప్పి మరోసారి రాజమౌళి తన మార్కెటింగ్ టాలెంట్‌ను నిరూపించారు. ముందుగా ఈ సినిమా మార్చి చివర్లో విడుదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ రాజమౌళి ఉగాది పండుగ సమయాన్ని టార్గెట్ చేస్తూ ఏప్రిల్ 7న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

భారీ అడ్వెంచర్ కథ

‘వారణాసి’ సినిమా ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. భారత పురాణాల ఆధారంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ కథ సాగుతుందని సమాచారం. ఫాంటసీ అంశాలు కూడా ఇందులో ఉంటాయి. కథ వేల సంవత్సరాల కాలాన్ని చూపిస్తూ, ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రయాణిస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఆయన పాత్ర పేరు రుద్ర. ప్రియాంక చోప్రా కీలక పాత్రలో మందాకినిగా కనిపించనున్నారు.
విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆయన పాత్ర పేరు కుంభ.

భారీ తారాగణం & టెక్నికల్ టీమ్

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం. కీరవాణి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఆయన - రాజమౌళి కలయికపై భారీ అంచనాలు ఉన్నాయి. గత ఏడాది నవంబర్‌లో సినిమా పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశారు. ఆ తర్వాత వచ్చిన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు.

గ్లోబల్ రేంజ్ సినిమా

‘ఆర్‌ఆర్‌ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఈ సినిమాతో అంతకంటే పెద్ద స్థాయిని టార్గెట్ చేస్తున్నారు. కథ భారతదేశంతో పాటు ఆఫ్రికా, అంటార్కిటికా వంటి ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని సమాచారం. ఈ సినిమా ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ స్టైల్‌లో ఉంటుందని టాక్.

మొత్తానికి, ఒక్క ఫ్లెక్స్‌తో ప్రపంచం దృష్టిని తన సినిమా వైపు తిప్పిన రాజమౌళి, మరోసారి “హైప్ మాస్టర్” అనిపించుకున్నారు. ‘వారణాసి’ 2027లో ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు