Rahul Ramakrishna: ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ కాస్త కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదలై థియేటర్ల వద్ద భారీ సందడి కనిపించేది. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. పెద్ద సినిమాలు లేకపోవడం, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడం వల్ల చాలా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితిపై నటుడు రాహుల్ రామకృష్ణ Rahul Ramakrishna సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. “థియేటర్లు ఖాళీగా ఉండటం అనేది ప్రేక్షకులు ఇస్తున్న నిజమైన తీర్పు. మనం తీస్తున్న సినిమాల స్థాయి ఎలా ఉందో అది చూపిస్తోంది” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, ఈ రోజుల్లో సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కి రావడం అంత ఈజీ కాదని చెప్పారు. బయటకు రావాలంటే ముందుగా వేసవి ఎండలు, ట్రాఫిక్ ఇబ్బందులు, పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు వంటి చాలా విషయాలు ప్రేక్షకుడిని ఆపుతున్నాయని అన్నారు.
అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేక్షకుడు థియేటర్‌కి రావాలంటే సినిమా నిజంగా ప్రత్యేకంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంట్లో మొబైల్ లేదా ఓటీటీలో చూసే కంటెంట్ కంటే థియేటర్లో చూడాల్సినంత గొప్ప అనుభూతి సినిమా ఇవ్వాలని చెప్పారు.
ఇప్పటి ప్రేక్షకులు సాధారణ కథలతో లేదా వీక్ సినిమాలతో సంతృప్తి చెందడం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. మంచి కథ, కొత్త అనుభూతి, బలమైన ఎమోషన్స్ ఉన్న సినిమాలకే ఇప్పుడు ప్రేక్షకులు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రాహుల్ రామకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో చాలా మంది మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, మిగతా సినిమాలను ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Rahul Ramakrishna: "సినిమాలు బాగోలేవ్".. టాలీవుడ్‌పై రాహుల్ రామకృష్ణ సంచలన కామెంట్స్!
నటుడు రాహుల్ రామకృష్ణ ఖాళీ థియేటర్లపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ట్రాఫిక్, పెట్రోల్ ఖర్చులు, థియేటర్ రేట్లు వంటి ఇబ్బందులు దాటుకుని ప్రేక్షకులు రావాలంటే సినిమాలు నిజంగా గొప్పగా ఉండాలని ఆయన అన్నారు. బలహీనమైన కంటెంట్ కారణంగానే థియేటర్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
Rahul Ramakrishna
Rahul Ramakrishna: ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ కాస్త కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదలై థియేటర్ల వద్ద భారీ సందడి కనిపించేది. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. పెద్ద సినిమాలు లేకపోవడం, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడం వల్ల చాలా థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితిపై నటుడు రాహుల్ రామకృష్ణ Rahul Ramakrishna సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీశాయి. ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. “థియేటర్లు ఖాళీగా ఉండటం అనేది ప్రేక్షకులు ఇస్తున్న నిజమైన తీర్పు. మనం తీస్తున్న సినిమాల స్థాయి ఎలా ఉందో అది చూపిస్తోంది” అని అన్నారు.
Also Read: ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ ప్లాన్‌తో వస్తున్న రామ్ చరణ్!
ఇంకా ఆయన మాట్లాడుతూ, ఈ రోజుల్లో సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కి రావడం అంత ఈజీ కాదని చెప్పారు. బయటకు రావాలంటే ముందుగా వేసవి ఎండలు, ట్రాఫిక్ ఇబ్బందులు, పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు వంటి చాలా విషయాలు ప్రేక్షకుడిని ఆపుతున్నాయని అన్నారు.
అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేక్షకుడు థియేటర్‌కి రావాలంటే సినిమా నిజంగా ప్రత్యేకంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంట్లో మొబైల్ లేదా ఓటీటీలో చూసే కంటెంట్ కంటే థియేటర్లో చూడాల్సినంత గొప్ప అనుభూతి సినిమా ఇవ్వాలని చెప్పారు.
Also Read: ‘కాంచన 4’తో రాఘవ లారెన్స్ హిట్ ఫ్రాంచైజీకి ది ఎండ్.. ఎమోషన్ అవుతోన్న ఫ్యాన్స్!