/rtv/media/media_files/2025/03/20/cJUHbxzkyMtcmLqIWEiX.jpg)
Kanchana 4
Kanchana 4: మన తెలుగులో దెయ్యం సినిమా(Horror Film) అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ‘కాంచన’. ఈ సిరీస్ తో అందరిని ఫుల్ గా బయపెట్టేస్తున్నాడు రాఘవ లారెన్స్. అయితే కాంచన ఫ్రాంచైజ్‌లో ఇప్పుడు కొత్తగా ‘కాంచన 4’ తెరకెక్కుతోంది. అయితే ఈసారి హారర్ తో పాటు గ్లామర్ డోస్ కూడా పెంచనున్నాడు లారెన్స్. ఇద్దరు ముద్దుగుమ్మలు ఈ సినిమాలో హీరోయిన్స్ గా మెరవబోతున్నారు.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
ఇప్పటికే కాంచన సిరీస్ లో వచ్చిన మూవీస్ అన్ని ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. ఇక 'కాంచన 4' పై అంచనాలు కూడా అదే రకంగా ఉన్నాయి. ఈసారి సినిమాలో కత్తిలాంటి ఇద్దరు హీరోయిన్లు యాడ్ అవ్వడం కాంచన 4 కి మరింత హైప్ తీసుకురానుంది.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
ఇద్దరు ముద్దుగుమ్మలతో లారెన్స్..
కాంచన 4 లో గ్లామర్ డోస్ పెంచేందుకు బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహిని(Nora Fatehi) లారెన్స్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్‌గా ఇప్పటికే పూజా హెగ్డే(Pooja Hegde) నటించనుంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో కలసి లారెన్స్ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నాడట.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
అయితే, ఈ సినిమాలో పూజా దెయ్యంగా భయపెట్టనుందని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. అదే జరిగితే ఈసారి లారెన్స్ తన బాడీని పూజా హెగ్డేకి అద్దెకు ఇస్తాడనమాట.అయితే ప్రస్తుతం పూజా తమిళ్,తెలుగు బాషలలో వరుస సినిమాలను చేస్తోంది. అలాగే రజినీకాంత్ తో కలిసి కూలీ మూవీలో ఐటమ్ సాంగ్ లో స్టెప్పులేయ్యనుంది. కాంచన 4తో లారెన్స్ ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి.
Also Read: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న 'లూసిఫర్2: ఎంపురాన్' ట్రైలర్..!