ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప2' నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు నుంచే ఈ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. ముఖ్యంగా నార్త్ లో 'పుష్ప' క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ లో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. మల్టీ ప్లెక్స్ లోనూ అదే జోరు.. సింగిల్ స్క్రీన్స్ తో ఐమ్యాక్స్, PVR, INOX లాంటి మల్టిప్లెక్స్ లలో బుకింగ్స్ జోరందుకున్నాయి. టికెట్ రేట్లు భారీగా పెరిగినా కూడా ఆడియన్స్ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. నార్త్ సైడ్ అయితే పుష్ప2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతూ హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే 'పుష్ప2' వీకెండ్ పూర్తయ్యే లోపే రూ.500 కోట్ల మార్క్ ఈజీగా అందుకునే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'పుష్ప' ఫీవర్ చూస్తుంటే జస్ట్ ఓపెనింగ్ రోజునే సుమారు.300 కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ గా కనిపిస్తోంది. అదే జరిగితే 'పుష్ప2' గత ఇండియన్ సినిమాల రికార్డులన్నీ బ్రేక్ అవుతాయని చెప్పడంలో సందేహాం లేదు. ఇప్పటిదాకా బాహుబలి2, KGF2, RRR లాంటి పాన్ ఇండియా సినిమాలు భారీ ఓపెనింగ్స్ అందుకున్నాయి. ఇప్పుడు 'పుష్ప2' వాటన్నింటినీ దాటి ఓపెనింగ్స్ లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.