'పుష్ప2' తో పాటూ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలు ఇవే 'పుష్ప2' మూవీ వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. థియేట్రికల్ గా రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 'పుష్ప2' తో పాటూ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలేవో ఈ స్టోరీలో తెలుసుకోండి. By Anil Kumar 05 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప2' నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ 12,000 థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా థియేట్రికల్ - నాన్ థియేట్రికల్ కలుపుకొని ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ కి థియేట్రికల్ గా వరల్డ్ వైడ్ రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మరే తెలుగు సినిమాకు కూడా ఈ స్థాయి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. దానితో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న తెలుగు సినిమాలలో పుష్ప పార్ట్ 2 మూవీ మొదటి స్థానంలో నిలిచింది. 'పుష్ప2' తో పాటూ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలను పరిశీలిస్తే.. RRR : రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.451 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ రెండవ స్థానంలో నిలిచింది.\ కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రూ.370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ 3 వ స్థానంలో నిలిచింది. బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ 4 వ స్థానంలో నిలిచింది. సలార్ : ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రూ.345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ 5 వ స్థానంలో నిలిచింది. #pushpa2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి