Prabhas Spirit Update: ప్రభాస్ ‘స్పిరిట్’ టెస్ట్ షూట్ ఫినిష్.. ఇక నాన్ స్టాప్ కొట్టుడే..!

ప్రభాస్ 'స్పిరిట్' టెస్ట్ షూట్‌ పూర్తయ్యింది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రభాస్ 'రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాల్లో బిజీగా ఉన్నారు. అలాగే, 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ నవంబర్ 24న విడుదల కానుంది.

New Update
Prabhas Spirit Update

Prabhas Spirit Update

Prabhas Spirit Update: రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రంలో కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ఒక పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు, ఇది ఆయన కెరీర్‌లో మొదటిసారి. అయితే ఈ చేంజ్ అభిమానులను, టీమ్‌ను కూడా ఆశ్చర్యపరిచింది.

Also Read: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నార్త్ అమెరికా బుకింగ్స్‌ షురూ! ఎప్పటినుండంటే..?

అందరికీ తెలిసినట్లుగా, ప్రభాస్ కు కొత్త కొత్త జానర్స్ చేయడం చాలా ఇష్టం. టెస్ట్ సీక్వెన్సుల్లో ఆయన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ చూపించారని సమాచారం. ఇది లైవ్ గా షూట్ చూశారంటే, ప్రభాస్ పాత్రను చాలా డెప్త్ తో చేసారని చెప్పుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా కూడా ఈ టెస్ట్ షూట్ తర్వాత చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రభాస్ ఇప్పటివరకు చూడని కొత్త రూపంలో కనిపించబోతున్నాడు. 

అయితే, స్పిరిట్ పూర్తి షూటింగ్ ప్రారంభం కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతంలో ప్రభాస్ 'ది రాజా సాబ్',  'ఫౌజీ' సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆ రెండు కమిట్మెంట్స్ పూర్తయ్యాకే స్పిరిట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ప్రారంభమవుతుంది.

Also Read: జపాన్‌లో ప్రభాస్ హంగామా.. 'బాహుబలి: ది ఎపిక్' రీ–రిలీజ్‌ స్పెషల్!

‘బాహుబలి: ది ఎపిక్’ రీ–రిలీజ్ కోసం జపాన్ యాత్ర

ప్రభాస్ ‘బాహుబలి: ది ఎపిక్’ 4K రీ–రిలీజ్ కోసం డిసెంబర్‌లో జపాన్ కి వెళ్లబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. గత సంవత్సరం ‘కల్కి 2898 AD’ స్క్రీనింగ్ కోసం ప్రభాస్ వెళ్లలేకపోయాడు, కాబట్టి ఈసారి అభిమానులను నిరాశపరచకుండా ట్రిప్ ఖరారు అయ్యింది.

Also Read: ప్రభాస్ ప్రాజెక్ట్స్ నుండి అందుకే తప్పుకున్నా: దీపికా పదుకొణె

‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్

మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ది రాజా సాబ్ పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ చాలా కాలం ఎదురుచూస్తున్నారు. మొదట ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేయాలని ప్లాన్ చేయగా, తర్వాత నవంబర్ మొదటి వారానికి మార్చారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ సింగిల్ నవంబర్ 24న రిలీజ్ అవుతుంది. అధికారిక ప్రకటన ఈ వారంలో జరగనుంది. వచ్చే జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడంతో, ప్రమోషన్స్‌ను ఈ నెలలో ప్రారంభించడం టీమ్‌కి ముఖ్యంగా అవసరం. ఈ మూడు అప్‌డేట్స్ స్పిరిట్ టెస్ట్ షూట్, బాహుబలి జపాన్ రీ–రిలీజ్, ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Also Read: కథ చెబుతానని పిలిచి ఆ డైరెక్టర్ బలవంతం చేసాడు: మౌనీ రాయ్

Advertisment
తాజా కథనాలు