Prabhas RajaSaab: రాజాసాబ్ వచ్చేస్తున్నాడు.. డార్లింగ్ లుక్ అదిరిందిగా!!

సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల అని మేకర్స్ చెప్పినప్పటికీ వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ వినిపిస్తోంది.

New Update
prabhas rajasaab

prabhas rajasaab

Prabhas RajaSaab: సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు, స్టార్ హీరోల నుంచి కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

గతేడాది 'కల్కి'తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్(Prabhas), ఈ ఏడాది 'రాజా సాబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ డైరెక్టర్ మారుతి(Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హార్రర్ కామెడీ మూవీలో, ప్రభాస్ సరసన మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలలో కనిపిస్తారు, తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన పోస్టర్ లో ప్రభాస్ కూల్ లుక్ తో కనిపిస్తున్నారు. కళ్ళజోడు పెట్టుకుని నవ్వుతూ తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు, ఈ స్టయిలిష్ లుక్‌తో పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే, ఏప్రిల్ 10న సినిమా విడుదల అవ్వనుంది.

Aslo Read :  Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గాయోచ్‌!

తమన్(Thaman) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆడియో లాంచ్ జపాన్‌లో జరుగుతుందని తెలిపారు. జపనీస్ వెర్షన్‌లో ప్రత్యేక సాంగ్ కూడా ప్లాన్ చేసినట్లు చెప్పారు. చిత్రంలో ఓ డ్యూయెట్, స్పెషల్ సాంగ్, మూడు హీరోయిన్లతో ఓ పాట, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉండబోతున్నాయి. 

Also Read :  కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్

ప్రభాస్ ఈ చిత్రం తర్వాత ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ వంగతో ‘స్పిరిట్’ చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నారు, ఆ తరువాత 'కల్కి 2'(Kalki 2), 'సలార్ 2'(Salaar 2) వంటి భారీ చిత్రాలు కూడా ఆయన చేయబోతున్నారు. ఈ సినిమాల తర్వాత కొంత విరామం తీసుకుని మరిన్ని ప్రాజెక్టులకు సంతకం చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి కూడా కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి, కానీ వాటిపై క్లారిటీ రావడానికి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read :  Kate Middleton: క్యాన్సర్‌ నుంచి బయటపడ్డాను: వేల్స్ యువరాణి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు