/rtv/media/media_files/2026/02/06/raja-saab-ott-2026-02-06-10-36-44.jpg)
Raja Saab TV Premieres
Raja Saab TV Premieres: ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన "ది రాజా సాబ్" సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రభాస్ అభిమానులు కూడా కొంతమంది ఈ సినిమాతో సంతృప్తి చెందలేదు. ఈ ఫలితంతో దర్శకుడు మారుతీపై విమర్శలు కూడా వచ్చాయి.
ఇప్పుడు ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన నాలుగు నెలలకే టీవీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఛానల్ స్టార్ మాలో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఏప్రిల్ 26, 2026 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం చేయనున్నారు.
థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా, టీవీ ప్రేక్షకులను అయినా ఆకట్టుకుంటుందా లేదా మళ్లీ అదే రిజల్ట్ వస్తుందా అనేది చూడాలి.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ Nidhhi Agerwal, మాలవికా మోహనన్ Malavika Mohanan, రిద్ది కుమార్ Riddhi Kumar, సంజయ్ దత్ Sanjay Dutt, జరీనా వహాబ్ Zarina Wahab, బోమన్ ఇరానీ Boman Irani ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను People Media Factory నిర్మించగా, సంగీతం తమన్ ఎస్ Thaman S అందించారు.
Follow Us