/rtv/media/media_files/2026/03/31/prabhas-biker-2026-03-31-19-25-07.jpg)
Prabhas Biker
Prabhas Biker: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ హిట్ ఇచ్చిన తరువాత, కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి ఆయన నటిస్తున్న చిత్రం ‘బైకర్’, మోటోక్రాస్ నేపథ్యంలో రూపొందుతున్న భారతదేశపు తొలి స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ‘బైకర్’ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్‌తో పాటు, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కలిపి ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఈ ట్రైలర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రైలర్ షేర్ చేస్తూ, ఇది చాలా ఎంగేజింగ్‌గా ఉందని, సినిమా వైబ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అలాగే, సినిమా ఏప్రిల్ 3న విడుదల కాబోతున్నందుకు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు బైకర్ మూవీ టీమ్. అందుకు సంబంధించిన 30 సెకండ్ల గ్లింప్సె ను రిలీజ్ చేశారు అందులో ప్రభాస్ నడుచుకుంటూ వచ్చి బైక్ మీద స్టైల్ గా కూర్చొని " ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్" అంటూ డైలాగు చెప్పడం ఆకట్టుకుంది. లెట్స్ రేస్ అంటూ ప్రభాస్ తో చేసిన ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.
ప్రభాస్ హోమ్ బ్యానర్ యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటినుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టారు ప్రభాస్, అవసరమైతే కొన్ని ఈవెంట్స్‌లో గెస్ట్‌గా కూడా హాజరవచ్చు.
చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తుండగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ‘బైకర్’ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రియాక్షన్ చూసిన తర్వాత, సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow Us