Munna 4k Trailer: రెబల్ స్టార్ ర్యాంపేజ్..! 'మున్నా 4K' రీ-రిలీజ్ ట్రైలర్‌ చూశారా..?

ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ సినిమా ‘మున్నా’ రీ-రిలీజ్ ట్రైలర్‌ను తాజాగా దిల్ రాజు యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. ప్రభాస్ స్టైల్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అప్పట్లో యూత్‌కు బాగా నచ్చాయి. ఇప్పుడు మరోసారి 4K క్వాలిటీలో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

New Update
Munna 4k Trailer

Munna 4k Trailer

Munna 4k Re Release Trailer

Munna 4k Trailer: ‘రెబల్ స్టార్’ ప్రభాస్(Prabhas) నటించిన స్టైలిష్ యాక్షన్ సినిమా ‘మున్నా’ మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. సుమారు 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పట్లో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రభాస్ స్టైల్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ యూత్‌కు బాగా నచ్చాయి. అయితే ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు.

ఇప్పుడైతే టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ బలంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 6న ‘మున్నా’ను గ్రాండ్‌గా మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించారు. దీనికి సంబందించిన రీ-రిలీజ్ ట్రైలర్‌ను తాజాగా దిల్ రాజు యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు.  ఈసారి సినిమాను 4K క్వాలిటీలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పెద్ద తెరపై మరింత క్లియర్ విజువల్స్‌తో సినిమా చూడొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంతో వంశీ పైడిపల్లి దర్శకుడిగా పరిచయం అయ్యారు. హారిస్ జయరాజ్ అందించిన పాటలు అప్పట్లో మంచి హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.

మార్చి 6న పెద్దగా కొత్త సినిమాలు లేకపోవడం కూడా ఈ రీ-రిలీజ్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. గతంలో కొన్ని రీ-రిలీజ్ సినిమాలు మంచి సక్సెస్ సాధించినట్లు, ‘మున్నా’ కూడా ఈసారి సర్‌ప్రైజ్ హిట్ అవుతుందా అనే ఆసక్తి నెలకొంది. 19 సంవత్సరాల తర్వాత మళ్లీ వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు