Prabhas Fauzi: ‘ఫౌజీ’ షూటింగ్ కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి!

ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌కు వెళ్లే ప్రొడక్షన్ వాహనం అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update
Prabhas Fauzi

Prabhas Fauzi

Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas నటిస్తున్న కొత్త సినిమా ‘ఫౌజీ’ షూటింగ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. దర్శకుడు హను రాఘవపూడి Hanu Raghavapudi రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

షూటింగ్ లొకేషన్‌కు వెళ్లేందుకు ప్రొడక్షన్ టీమ్ ప్రయాణిస్తున్న వాహనం హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.

Also Read: ‘దళపతి’ టూ ‘సీఎం’ విజయ్.. విక్టరీతో మారిన ‘జన నాయకన్’ టైటిల్..!

ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానికులు సహాయం చేసి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

Also Read: 'గిల్లి' నుంచి 'లియో' వరకు.. విజయ్-త్రిష హిట్ ట్రాక్ రికార్డ్ ఇదే!

ఈ ఘటనతో సినిమా యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

‘ఫౌజీ’ సినిమాలో కథానాయికగా ఇమాన్వి Imaanvi నటిస్తుండగా, జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ Mythri Movie Makers నిర్మిస్తోంది. దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు