/rtv/media/media_files/2026/04/24/darling-4k-collections-2026-04-24-10-01-26.jpg)
Darling 4K Collections
Darling 4K Collections: డార్లింగ్ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదల కావడంతో ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ కనిపిస్తోంది. ప్రభాస్ నటించిన ఈ ప్రేమ కథా చిత్రం 16 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అయినా కూడా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలో కూడా చాలా షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఉదయం నుంచే అభిమానులు థియేటర్ల దగ్గరకి చేరుకుని సందడి చేశారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, కుటుంబంతో వచ్చే ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో సినిమా చూడటానికి వచ్చారు.
AND IT’S A STORM 💥🔥
— Daya Arjun (@DayaArjun2) April 24, 2026
BLOCKBUSTER RE-ENTRY WITH A RECORD SMASHING OPENING 🚀
₹7.59 CR DAY 1 – WORLDWIDE GROSS 💰
Grab Your Tickets 🎟️ : https://t.co/zoJx2LtanR
Grand Re-Release by @KedarFilms#Darling4K#RebelStar#Prabhas@MsKajalAggarwal@gvprakash#Karunakaran… pic.twitter.com/uLoi7uDmdB
అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా ఈ సినిమా మంచి రికార్డులు సృష్టించింది. రీ-రిలీజ్ సినిమాల్లో ఇది టాప్ లిస్ట్‌లో నిలిచింది. థియేటర్లలో పాటలు, డైలాగ్స్ వచ్చేటప్పుడు అభిమానులు పేపర్లు చల్లుతూ, డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ తో ప్రభాస్ కెమిస్ట్రీ, అలాగే దర్శకుడు ఎ. కరుణాకరన్ స్టైల్‌లో ఉన్న ఫీల్ గుడ్ సీన్స్ ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది ఈ సినిమాను చూస్తూ పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. #Darling4K హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.
ట్రేడ్ సమాచారం ప్రకారం, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లకు పైగా వసూలు చేసింది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా చాలా బలంగా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే గ్రాస్ సుమారు ₹7.59 కోట్ల వరకు చేరినట్లు సమాచారం. మొత్తం మీద ‘డార్లింగ్’ రీ-రిలీజ్ మంచి స్టార్ట్ తీసుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకెళ్తోంది.
Follow Us