Prabhas - Prasanth Varma: ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ.. ఆ సినిమాలో క్యామియో!

ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో ప్రభాస్ ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు ఉన్నాయి. ‘మహాకాళి’ సినిమాలో ఆయన కామియో ద్వారా ‘బ్రహ్మరాక్షస్’ పాత్రను పరిచయం చేసే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రకు స్పందన బట్టి పూర్తి సినిమా చేసే అవకాశం ఉంది.

New Update
Prabhas - Prashanth Varma

Prabhas - Prasanth Varma

Prabhas - Prasanth Varma: టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టించిన *సినిమాటిక్ యూనివర్స్ లో స్టార్ హీరోల ఎంట్రీలు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ‘హను-మాన్’ సినిమాతో మొదలైన ఈ యూనివర్స్‌లో ఇప్పటికే రిషబ్ శెట్టీ ‘జై హను-మాన్‌’తో పరిచయమయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ యూనివర్స్‌లో అడుగుపెడతాడని వార్తలు వినిపిస్తున్నాయి.

టాక్ ప్రకారం, ప్రభాస్, ప్రశాంత్ వర్మ ‘బ్రహ్మరాక్షస్’ అనే చిత్రంపై పని చేయబోతున్నారు. అయితే, ఆ సినిమా తెరకెక్కకముందే, ప్రభాస్ చేయబోయే పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ప్రశాంత్ వర్మ ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ PVCUలో భాగంగా ‘మహాకాళి’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫీమేల్ సూపర్ హీరో ప్రధానంగా రూపొందిస్తున్నారు, కథ, స్క్రీన్‌ప్లే ప్రశాంత్ వర్మ ఇవ్వగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

సినిమాలో ప్రభాస్ ఒక చిన్న కామియోలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ షార్ట్ ఎంట్రీ ద్వారా బ్రహ్మరాక్షస్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారట మూవీ టీమ్. ప్రేక్షకుల స్పందన బాగుంటే, ప్రభాస్ తో బ్రహ్మరాక్షస్ సినిమా చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, బ్రహ్మరాక్షస్ పాత్ర నెగటివ్ షేడ్స్ ఉన్న శక్తివంతమైన రోల్, ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కీలక మలుపుగా మారనుంది. అయితే, కొన్ని వర్గాలు బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్ నిజంగా ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు.

దీంతో పాటుగా, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’పై పని చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

Advertisment
తాజా కథనాలు