అనుష్క కాదు, కాజల్ కాదు.. ప్రభాస్ కి సరైన జోడీ ఈ హీరోయినే! ప్రభాస్ సరసన అనుష్క కాదు, కాజల్ కాదు.. ఈ ముద్దుగుమ్మ సరైన జోడీ అనిపించుకుంది. ప్రభాస్ తో తొలి సినిమా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆ అందాల తార ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 23 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 ప్రభాస్ సరసన ఎంతోమంది హీరోయిన్లు నటించారు. కానీ వాళ్లలో అనుష్క- ప్రభాస్, కాజల్- ప్రభాస్ జోడీలు బాగా హిట్టయ్యాయి. ఈ పెయిర్స్ స్క్రీన్ పై కనిపిస్తే చాలా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అయితే వీరిద్దరి కంటే ముందు మరో ముద్దుగుమ్మ ప్రభాస్ సరైన జోడీ అనిపించుకుంది. 2/6 ఆ అందాల తార మరెవరో కాదు త్రిష. ప్రభాస్- త్రిష నటించిన 'వర్షం' వన్ ఆఫ్ ది క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. 2004 లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అప్పటివరకు ప్రభాస్ చాలా మంది హీరోయిన్లతో నటించినప్పటికీ 'త్రిషతో' మాత్రం ప్రేక్షకులలో ఫీలింగ్ కలిగించింది. 3/6 'వర్షం' తో తొలిసారి స్క్రీన్ పై మెరిసిన త్రిష.. ప్రభాస్ జోడీగా అందరినీ మైమరిపించింది. ఆన్ స్క్రీన్ వీళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ముఖ్యంగా 'మెల్లగా కరగని' సాంగ్ లో త్రిష- ప్రభాస్ కెమిస్ట్రీ అభిమానులను ప్రేమలో పడేసింది. వావ్ ఈ జోడీ భలే ఉందే అనేలా అనిపించింది. 4/6 'వర్షం' తో సూపర్ హిట్ పెయిర్ గా నిలిచిన ఈ కాంబో 2006 లో 'పౌర్ణమి' తో మరో సారి స్క్రీన్ పై మైమరిపించింది. ఈ మూవీలో చార్మీ, త్రిష ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ అందరి దృష్టి త్రిష పైనే పడింది. ప్రభాస్ ప్రేయసిగా ప్రేక్షకులను ఫిదా చేసింది. 5/6 ఆ తర్వాత 2008లో 'బుజ్జిగాడు' సినిమాతో ఈ హిట్ పెయిర్ మరో సారి సందడి చేసింది. ఇందులో చిట్టి- బుజ్జిగా కనిపించిన ప్రభాస్- త్రిష జోడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అప్పట్లో ప్రభాస్- త్రిష జోడికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. అలా ప్రభాస్ సరసన మెప్పించిన హీరోయిన్లలో కాజల్, అనుష్క కంటే ముందు త్రిష సరైన జోడీ అనిపించుకుంది. 6/6 ఈ మూడు సినిమాలు త్రిష కెరీర్ లో ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. ప్రస్తుతం త్రిష టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి