/rtv/media/media_files/2026/02/06/prabhas-japan-anan-magazine-2026-02-06-10-10-44.jpg)
Prabhas Japan Anan Magazine
Prabhas Japan Anan Magazine: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జపాన్‌లో మరో అరుదైన ఘనత సాధించారు. జపాన్‌కు చెందిన ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ “అనాన్ (Anan)” లో ప్రభాస్ ఒంటరిగా బ్యాక్ కవర్‌పై కనిపించి చరిత్ర సృష్టించారు. ఇది భారతీయ నటుడికి ఇదే తొలిసారి కావడం విశేషం.
ఫిబ్రవరి 10న విడుదల కానున్న Anan మ్యాగజైన్ ఇష్యూ నెంబర్ 2483 బ్యాక్ కవర్‌పై ప్రభాస్ ఫోటో ఉంటుంది. ఇంతకుముందు 2023లో RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆ మ్యాగజైన్ కవర్‌పై కనిపించారు. కానీ ఒంటరిగా ఫీచర్ అయిన తొలి భారతీయ నటుడిగా ప్రభాస్ ఇప్పుడు రికార్డు సృష్టించారు.
🌍💣 Indian cinema’s biggest superstar Prabhas goes global 🇮🇳➡️🇯🇵
— 𝐆𝐎 𝐓𝐄𝐋𝐔𝐆𝐔 𝐂𝐈𝐍𝐄𝐌𝐀 (@gotelugucinema) February 5, 2026
🔥 Rebel Star Prabhas creates global waves as #Prabhas features on Japan’s iconic #anan magazine, with the issue going on sale from Feb 10 and pre-orders already open 🔥#Baahubali#Kalki2898AD#Salaar#Spirit… pic.twitter.com/zVtDAz0xTx
ఈ ఫీచర్‌ను మ్యాగజైన్ “Irresistible Feelings” థీమ్‌లో భాగంగా “Royal Audience Gravure”గా పేర్కొంది. ఇది జపాన్‌లో ప్రభాస్‌కు ఉన్న అభిమానాన్ని, ఆయన పట్ల ప్రేక్షకుల ఆకర్షణను స్పష్టంగా చూపిస్తోంది.
జపాన్‌లో ప్రభాస్‌కు భారీ గుర్తింపు బాహుబలి: ది బిగినింగ్ సినిమా విడుదల తర్వాత వచ్చింది. ఆ సినిమా అక్కడ మంచి ఆదరణ పొందడంతో ప్రభాస్ పేరు జపాన్ ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయింది.
ఈ ప్రత్యేక కవర్ షూట్ డిసెంబర్ 2025లో టోక్యోలో జరిగింది. అప్పట్లో ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ కోసం జపాన్‌కి వెళ్లి, అభిమానులతో కలుసుకున్నారు. ఆయన తరచూ జపాన్ అభిమానులతో కనెక్ట్ అవుతూ ఉండడం వల్ల అక్కడ తన క్రేజ్‌ను నిలబెట్టుకుంటున్నారు.
ప్రభాస్ తదుపరి సినిమాలు
సినిమాల విషయానికి వస్తే, ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో “ఫౌజీ” సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్” సినిమాలో కూడా నటిస్తున్నారు. త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “కల్కి 2” సినిమా పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.
జపాన్‌లో మ్యాగజైన్ కవర్‌తో ప్రభాస్ సాధించిన ఈ విజయం, ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్‌కు మరో ఉదాహరణగా నిలుస్తోంది.
Follow Us