/rtv/media/media_files/2026/05/22/pooja-hegde-2026-05-22-09-54-51.jpg)
Pooja Hegde
Pooja Hegde: పూజా హెగ్డే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి ఆమె సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా చర్చకు వచ్చాయి. తాజాగా కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవడంతో ఆమె సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ఈ రూమర్స్‌కు కారణం ఆమె ఇటీవల షేర్ చేసిన ఒక వీడియోలో చేతికి కనిపించిన రింగ్. ఆ రింగ్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు అభిమానులు ఇది ఎంగేజ్‌మెంట్ రింగ్ అయి ఉండొచ్చని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం ఫ్యాషన్ కోసం వేసుకున్న రింగ్ మాత్రమే అని అంటున్నారు.
ఇంకా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో Rohan Mehra ఆమె తరచుగా కలిసి కనిపించడం. గత కొంతకాలంగా ముంబైలో ఇద్దరూ కలిసి బయట కనిపించడంతో వీరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు పూజా హెగ్డే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు ఇంకా సస్పెన్స్‌లోనే ఉన్నాయి.
ఇక కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల వరుసగా కొన్ని సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా పూజా హెగ్డే మళ్లీ బిజీ అవుతోంది. బాలీవుడ్‌లో ఆమె నటిస్తున్న కొత్త సినిమా వరుణ్ ధావన్ Varun Dhawanతో త్వరలో విడుదల కానుంది. అలాగే తమిళ స్టార్ Vijay సరసన నటించిన జన నాయకన్ Jana Nayagan సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
మరోవైపు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ Dulquer Salmaanతో కూడా ఆమె ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద పూజా హెగ్డే ఎంగేజ్‌మెంట్ వార్తలపై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు.
Follow Us