Ram Charan - Modi: “పెద్ది గురించి చెప్పు చరణ్!” మోదీ అడిగిన ప్రశ్న వైరల్!

‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా రామ్ చరణ్ ఢిల్లీలో జరిగిన ఈవెంట్‌లో ప్రధాని మోదీతో తనకు జరిగిన సంభాషణను చెప్పారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల్లో మార్పు తీసుకురావడం ఈ సినిమా ప్రధాన అంశమని తెలిపాడు. ఒక వ్యక్తి గ్రామాన్ని ఎలా మార్చగలడో ‘పెద్ది’లో చూపించనున్నట్లు చరణ్ చెప్పారు.

New Update
Ram Charan - Modi

Ram Charan - Modi

Ram Charan - Modi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో దేశవ్యాప్తంగా తిరుగుతూ బిజీగా ఉన్నాడు. సినిమా విడుదలకు ముందు పలు నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహిస్తూ మూవీ టీమ్ ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచుతోంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన ప్రత్యేక ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో తనకు జరిగిన సంభాషణ గురించి చరణ్ మాట్లాడాడు. గతంలో ఢిల్లీలో మోదీని కలిసిన సమయంలో ఆయన “పెద్ది సినిమా దేని గురించి ఉంటుంది?” అని అడిగారని తెలిపారు.

దానికి తాను “ఈ సినిమా గ్రామాల అభివృద్ధి, ప్రజల్లో మార్పు తీసుకురావడం గురించి ఉంటుంది. ఇది వికసిత్ భారత్ ఆలోచనకు దగ్గరగా ఉంటుంది” అని చెప్పినట్లు రామ్ చరణ్ వెల్లడించాడు.

అప్పుడు మోదీ కూడా తనకు జరిగిన ఒక నిజ జీవిత సంఘటనను చెప్పారని చరణ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో చాలా మంది ఫుట్‌బాల్ జెర్సీలు ధరించి కనిపించారని మోదీ చెప్పారట. ఆ గ్రామానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి భారత ఫుట్‌బాల్ జట్టులో ఆడటం వల్ల అక్కడి యువతకు ప్రేరణ లభించిందని, ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి 80 మందికిపైగా ఫుట్‌బాల్ ఆడుతున్నారని ఆయన చెప్పినట్లు చరణ్ వివరించాడు.

ఆ విధంగానే ‘పెద్ది’ సినిమాలో కూడా ఒక వ్యక్తి గ్రామంలో మార్పు తీసుకురావడానికి ఎలా కారణమవుతాడో చూపించనున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. “పెద్ది అనేది తన చుట్టూ ఉన్నవారికి ధైర్యం ఇచ్చి, గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కథ” అని చరణ్ చెప్పాడు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో రామ్ చరణ్ పలు క్రీడల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలతో ఈ సినిమాలో మంచి సామాజిక సందేశం కూడా ఉండబోతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 4, 2026న పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

#Ram Charan - Modi
Advertisment
తాజా కథనాలు