/rtv/media/media_files/2026/05/28/peddi-promotions-2026-05-28-15-37-27.jpg)
Peddi Promotions
Peddi Promotions: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ హైప్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేందుకు మూవీ టీమ్ వరుస ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్ చేసింది. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది.
Massa Massa Song Peddi
ఈ రోజు ఢిల్లీలో ‘పెద్ది’ టీమ్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత చెన్నైలో కూడా ప్రత్యేక ప్రమోషన్ ఈవెంట్ జరగనుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఈ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇక ఈ ప్రమోషన్స్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ కూడా ఉండబోతోందని సమాచారం. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ‘పెద్ది’ టీమ్‌ను ఇంటర్వ్యూ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
జూన్ 1న విజయనగరంలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనుండగా, జూన్ 2న హైదరాబాద్‌లో భారీ ప్రెస్ మీట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ మొత్తం హాజరయ్యే అవకాశం ఉంది.
మరోవైపు సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ‘పెద్ది’ జ్యూక్‌బాక్స్ విడుదల చేశారు. ముఖ్యంగా ‘మాస్సా మాస్సా’ పాట ఫుల్ వెర్షన్ విడుదలతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయిపోయారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ భారీ ప్రమోషన్ టూర్‌తో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow Us