Peddi Pre Release: ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుండగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 1న జరుగుతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చే అవకాశం ఉందని టాక్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

New Update
Peddi Pre Release

Peddi Pre Release

Peddi Pre Release: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4, 2026న పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

సినిమా విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. అలాగే సినిమా ప్రచారం కోసం ప్రత్యేక సిటీ టూర్ ప్లాన్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 1, 2026న భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందనే వార్తలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.

అయితే అదే రోజు చిత్రబృందం విజయనగరంలో సిటీ టూర్‌లో పాల్గొనాల్సి ఉన్నట్లు షెడ్యూల్‌లో ఉంది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయనగరంలో జరుగుతుందా? లేక హైదరాబాద్‌లో నిర్వహిస్తారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు