Peddi Juke Box: ‘పెద్ది’ ఫీవర్ స్టార్ట్.. జ్యూక్‌బాక్స్ అవుట్ నౌ!

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఆడియో జ్యూక్‌బాక్స్ విడుదలైంది. ఇందులో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘మస్సా మస్సా’ పాట కూడా ఉంది. ఏఆర్ రెహమాన్ భోపాల్ ఈవెంట్‌లో హిందీ వెర్షన్ లైవ్‌గా పాడగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

New Update
Peddi Juke Box

Peddi Juke Box

Peddi Juke Box: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Peddi Juke Box Songs

ఇప్పటికే ప్రకటించినట్టుగానే మూవీ టీమ్ తాజాగా ‘పెద్ది’ ఆడియో జ్యూక్‌బాక్స్‌ను విడుదల చేసింది. దీనితో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మస్సా మస్సా’ పాటను కూడా రిలీజ్ చేశారు.

ఇటీవల భోపాల్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన టీమ్‌తో కలిసి ఈ పాట హిందీ వెర్షన్‌ను స్టేజ్‌పై లైవ్‌గా ప్రదర్శించారు. ఇప్పుడు అదే పాట తెలుగు వెర్షన్‌ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ మరింత ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, విశాల్ మిశ్రా ఆలపించారు. పాటలో మంచి ఎమోషన్ తో పాటు మాస్ ఫీల్ కూడా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నాయి.

మొత్తం మీద ‘పెద్ది’ జ్యూక్‌బాక్స్ విడుదలతో సినిమా హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా ‘మస్సా మస్సా’ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు