Anna Lezhneva: "చిరంజీవి బావగారు కాదు.. నా అన్న.." పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్!

పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొనిదెల చిరంజీవిని “అన్నయ్య” అని పిలవడం వెనుక కారణం చెప్పింది. మొదట్లో భర్తను చూసి అలా పిలిచానని, తర్వాత అది నిజమైన అనుబంధంగా మారిందని తెలిపింది. తనకు అన్నలు లేరని, జీవితం చిరంజీవి, నాగబాబును అన్నలుగా ఇచ్చిందని భావోద్వేగంగా చెప్పింది.

New Update
Anna Lezhneva

Anna Lezhneva

Anna Lezhneva: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భార్య అన్నా లెజినోవా (అన్నా కొనిదెల) ఇటీవల సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావడంతో పవన్ కళ్యాణ్ ఒక భావోద్వేగ పోస్టుతో స్వాగతం పలికారు. అలాగే చిరంజీవి, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వంటి కుటుంబ సభ్యులు కూడా ఆమెకు స్వాగతం తెలిపారు.

అయితే అందరి దృష్టిని ఆకర్షించింది అన్నా చేసిన ఒక కామెంట్. చిరంజీవికి రిప్లై ఇస్తూ ఆమె “అన్నయ్య” అని సంబోధించింది. సాధారణంగా “బావగారు” అని పిలుస్తారని భావించిన కొంతమంది నెటిజన్లు దీనిపై ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై వచ్చిన సందేహాలను చూసిన అన్నా స్వయంగా వివరణ ఇచ్చింది.

Anna Lezhneva Instagram

తన పోస్ట్‌లో ఆమె ఇలా చెప్పింది: “దాదాపు 15 ఏళ్ల క్రితం నేను ఈ కుటుంబంలోకి వచ్చాను. అప్పటికే అందరూ ఒకరికొకరు దగ్గరగా ఉన్నారు. నాకు ఎవరిని ఎలా పిలవాలో అర్థం కాలేదు. అప్పుడు నా భర్తను చూసి ‘అన్నయ్య’, ‘చిన్నన్నయ్య’ అని పిలవడం మొదలుపెట్టాను.”

మొదట్లో కాస్త సంకోచంతో ఆ మాటలు పలికానని, కానీ కాలక్రమేణా అవి తన మనసులో నిజమైన అనుబంధంగా మారాయని తెలిపింది. తర్వాత వేరేలా కూడా పిలవొచ్చని తెలిసినా, అప్పటికే ఆ పిలుపులో తన భావం కలిసిపోయిందని చెప్పింది.

“నాకు అసలు అన్నయ్యలు లేరు. కానీ జీవితం నాకు ఇద్దరు అన్నయ్యలను ఇచ్చింది - చిరంజీవి, నాగబాబు” అని ఆమె భావోద్వేగంగా చెప్పింది.

అన్నా చేసిన ఈ హృదయానికి హత్తుకునే పోస్ట్ చూసిన అభిమానులు ఎంతో మెచ్చుకున్నారు. మొదట ఆశ్చర్యంగా చూసిన విషయం ఇప్పుడు అందరికీ ఆమెపై మరింత అభిమానాన్ని పెంచింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

#Anna Lezhneva #Anna Lezhneva Instagram
Advertisment
తాజా కథనాలు