తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ 'బద్రి' మూవీ హీరోయిన్ అమీషా పటేల్.. తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడైన నీరవ్ బిర్లా అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. తాజాగా దుబాయ్ వెకేషన్ లో భాగంగా అతని కౌగిలిలో ఒదిగిపోతూ దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి By Anil Kumar 16 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్స్ లేటు వయసులో ప్రేమలో పడుతున్నారు. కొందరైతే 40 ఏళ్ళు దాటాక కూడా డేటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ కూడా చేరింది. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపిన ఈమె.. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ హీరోయిన్ తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడైన ఓ ఎన్నారై తో డేటింగ్ చేస్తోంది. ఇది కాస్త నెట్టింట హాట్ టాప్ టాప్ టాపిక్ గా మారింది. అమీషా పటేల్ ఒకప్పుడు సెన్సేషనల్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది. పవన్ కళ్యణ్ సరసన 'బద్రి' సినిమాతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. 'బద్రి' తర్వాత నరసింహుడు, నాని సినిమాలతో మెప్పించింది. Also Read : మూడు నెలల జీతం బ్రో.. మహేష్ టీ షర్ట్ ధర అన్ని వేలా? రెండు సార్లు ప్రేమలో పడీ.. ఆ తర్వాత బాలీవుడ్ కి పరిమితం అయిపోయింది. ఆ సమయంలో బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్‌తో అమీషా ప్రేమలో పడింది. సుమారు కొన్నేళ్లపాటు వారిద్దరూ డేటింగ్ కూడా చేశారు. అయితే, ఇద్దరి మధ్య పలు విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. విక్రమ్ భట్‌తో బ్రేకప్ చెప్పిన తర్వాత అమీషా పటేల్ మరో ఎన్ఆర్ఐతో ప్రేమాయాణాన్ని సాగించింది. అదీ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. కౌగిలిలో ఒదిగిపోతూ.. దీంతో అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. అయితే, తాజాగా ఓ 30 ఏళ్ల యువకుడితో దుబాయ్‌లో విహరిస్తూ అమీషా కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో అతని కౌగిలిలో ఒదిగిపోతూ ఫోజులు ఇచ్చిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. Also Read : అల్లు అర్జున్ కు శ్రీలీల స్పెషల్ గిఫ్ట్.. అందులో ఏముందంటే? 'నా డార్లింగ్ నిర్వాన్ బిర్లాతో.. లవ్లీ సాయంత్రం' అంటూ ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ కూడా జత చేసింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా 'నీరవ్ బిర్లా'.. అమీషా పటేల్ కంటే సుమారు 20 ఏళ్ల చిన్నవాడు. ఈ విషయం తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) #amisha-patel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి