/rtv/media/media_files/2026/05/30/peddi-overseas-2026-05-30-13-32-38.jpg)
Peddi Overseas
Peddi Overseas: రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం "పెద్ది" విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్ షోల విషయంలో అభిమానులకు ఊరట కలిగించే వార్త బయటకు వచ్చింది.
ఇటీవలి కాలంలో కొన్ని పెద్ద సినిమాలు విదేశాల్లో కంటెంట్ ఆలస్యంగా చేరడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో ప్రీమియర్ షోలు రద్దు కావడం, అలాగే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కలగడం జరిగింది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి.
అయితే "పెద్ది" చిత్ర బృందం ఈసారి ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, అమెరికా మార్కెట్‌లో ప్రదర్శించనున్న తెలుగు వెర్షన్ మొదటి భాగానికి సంబంధించిన కంటెంట్ ఇప్పటికే అన్ని డిజిటల్ థియేటర్లకు పంపించారు.
అలాగే రెండో భాగం కంటెంట్ ఇప్పటికే క్యూబ్ ఇండియా వద్ద సిద్ధంగా ఉందని, అది కూడా ఈ రాత్రికల్లా సంబంధిత ప్రాంతాలకు చేరేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
హార్డ్ డ్రైవ్‌ల ద్వారా సినిమాను ప్రదర్శించే ప్రాంతాలకు కూడా సోమవారం నాటికి పూర్తి కంటెంట్ అందజేయనున్నారు. దీంతో బుధవారం జరగనున్న ప్రీమియర్ షోలు ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా నిర్వహించే అవకాశం ఉంది.
ఇక ఇతర భాషల వెర్షన్ల కంటెంట్ కూడా త్వరలోనే పంపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రీమియర్ షోలు మాత్రం తెలుగు వెర్షన్‌కు మాత్రమే ఉంటాయి. డబ్బింగ్ వెర్షన్లు సినిమా అధికారిక విడుదల రోజునుంచే ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.
మొత్తంగా చూస్తే, ఓవర్సీస్‌లో "పెద్ది" ప్రీమియర్స్ ఎలాంటి ఆలస్యం లేకుండా జరగనున్నట్లు తాజా సమాచారం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
Follow Us