అక్టోబర్ రక్తపాతం.. ఇజ్రాయెల్-హమాస్ ఏడాది యుద్ధన్మోదాన్ని చూపించే ఫొటోలు ఇవే! ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు. By Archana 07 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 అక్టోబర్ లో మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఒక్క ఏడాదిలోనే ఎంతో మంది అమాయక చిన్నారులు, మహిళల ప్రాణాలు బలితీసుకుంది. దాదాపు 41 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు. Image Credits: REUTERS/ Ilan Rosenberg 2/6 UNICEF, గణాంకాల ప్రకారం.. ఈ దాడిలో బలైన వారిలో సగం మంది పిల్లలే ఉన్నట్లు తెలిసింది. ఇజ్రాయెల్ వైపు 1,706 1,706 మంది చనిపోయినట్లు గణాంకాల చెబుతున్నాయి. మరో వైపు ఇజ్రాయెల్ మరణాల సంఖ్యను దాస్తుందని పలు ఇంటర్ నేషనల్ మీడియా సంస్థల ఆరోపిస్తున్నాయి. Image Credits: REUTERS/ Ilan Rosenberg 3/6 ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అంతర్జాతీయ క్రిమినిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారి చేసినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికా అండతో పాలస్తీనా లో దాడులకు పాల్పడుతున్నారు. Image Credits: REUTERS/ Ilan Rosenberg 4/6 నిజానికి ఈ యుద్ధం అక్టోబర్ అక్టోబర్ 7న మొదలవ్వలేదు. ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్ నిర్బంధాల వల్ల పాలస్తీనా ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నిజానికి ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్మెంట్ ప్రాంతాలు ఒకప్పటి పాలిస్తానకు చెందినవే. ఆ తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో గొడ కట్టింది. ఇప్పుడు ఆ గోడను దాటి హమాస్ సైనికులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200మందిని చంపేశారంటే అది నెతన్యాహు ప్రభుత్వ ఫెయిల్యూర్‌గా చెప్పాలి. Image Credits: REUTERS/ Ilan Rosenberg 5/6 దీంతో ఇజ్రాయెల్‌లో బెంజమిన్పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న.. సమయంలో ఇజ్రాయెల్ ప్రజల డైవర్షన్ హమాస్‌వైపు వెళ్లింది. Image Credits: REUTERS/ Ilan Rosenberg 6/6 ప్రతీకార చర్య సాకుతో ఇజ్రాయెల్ గాజా గడ్డపై బెంజమిన్ బలగాలు రాకెట్లతో విరుచుకుపడ్డాయి. హమాస్ దళాలు ఉన్నరన్న అనుమానాలతో గాజాలోని ఆస్పత్రులపైనా ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. రిలీఫ్ క్యాంపులపైనా బాంబుల వర్షం కురిపించాయి. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. వీరిలో UNRWA లోని 179 మంది ఉద్యోగులతో సహా 224 మంది మానవతావాద వాలంటీర్లు ఉన్నారు. Image Credits: REUTERS/ Ilan Rosenberg మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి