/rtv/media/media_files/2026/05/27/off-campus-series-2026-05-27-14-54-38.jpg)
Off Campus Series
Off Campus Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో(Amazon Prime Video) విడుదలైన ‘ఆఫ్ క్యాంపస్’ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. విడుదలైన కేవలం 12 రోజుల్లోనే ఈ సిరీస్‌ను 36 మిలియన్ మంది వీక్షించడంతో, అమెజాన్ ప్రైమ్ చరిత్రలో అత్యధికంగా చూసిన డెబ్యూ సిరీస్‌లలో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
ఈ సిరీస్ విజయంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు యువతపై ఎంత పెద్ద ప్రభావం చూపుతున్నాయో మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఇలాంటి రొమాంటిక్, బోల్డ్ కంటెంట్ ఉన్న షోలను ఆసక్తిగా చూస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఈ సిరీస్‌కు వచ్చిన క్రేజ్‌తో పాటు మరో పెద్ద చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్‌లో ఎక్కువగా న్యూడిటీ, బోల్డ్ సీన్స్, ఇంటిమేట్ కంటెంట్ చూపించడం పై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ కావాలనే ఇలాంటి సన్నివేశాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా Gen Z యువతలో ఈ కంటెంట్‌కు భారీ ఆదరణ కనిపిస్తోందని సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. కథ, నటన ఎమోషన్స్ గురించి మాట్లాడటం కంటే బోల్డ్ సీన్స్, వైరల్ క్లిప్స్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. కొంతమంది తెలుగు యువతతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఇలాంటి కంటెంట్‌ను ఓపెన్‌గా ప్రమోట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, యువత ఆలోచనా విధానంలో కూడా మార్పులు తీసుకువస్తోందని విమర్శకులు అంటున్నారు. వైరల్ కావడం కోసం షాక్ వాల్యూ ఉన్న కంటెంట్‌ను ఎక్కువగా చూపించడం మంచిది కాదని, ఇది భవిష్యత్తులో సాధారణ విషయంగా మారే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.
మరోవైపు, కొంతమంది మాత్రం ఇది కొత్త తరానికి తగ్గ కథనం విధానం అని, సినిమాలు, వెబ్ సిరీస్‌లలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండాలని అభిప్రాయపడుతున్నారు. కానీ మరికొందరు మాత్రం మంచి కథ కంటే బోల్డ్ కంటెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సరైన దారి కాదని అంటున్నారు.
‘ఆఫ్ క్యాంపస్’ సిరీస్‌లో ఎల్లా బ్రైట్, బెల్మోంట్ కామెలి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను లూయిసా లేవీ రూపొందించగా, జీనా ఫటోర్‌తో కలిసి కో-షోరన్నర్‌గా కూడా పనిచేశారు.
అమెజాన్ MGM స్టూడియోస్ గ్లోబల్ టీవీ హెడ్ పీటర్ ఫ్రైడ్లాండర్ మాట్లాడుతూ, ప్రేక్షకులు ‘ఆఫ్ క్యాంపస్’కు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారని తెలిపారు. మంచి కథతో ప్రేక్షకుల నమ్మకం గెలిస్తే వారు ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పారు.
అమెజాన్ తెలిపిన వివరాల ప్రకారం, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’, ‘ఫాలౌట్’ తర్వాత అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన సిరీస్‌గా ‘ఆఫ్ క్యాంపస్’ నిలిచింది. అలాగే ‘ది బాయ్స్’, ‘రీచర్’, ‘ది సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టి’ వంటి పాపులర్ సిరీస్‌ల మొదటి సీజన్ వ్యూయర్‌షిప్‌ను కూడా ఇది దాటేసింది.
ప్రత్యేకంగా 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న మహిళా ప్రేక్షకుల్లో ఈ సిరీస్‌కు అత్యధిక ఆదరణ లభించిందని అమెజాన్ వెల్లడించింది. యువతను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న రొమాంటిక్ డ్రామా సిరీస్‌లకు ఓటీటీలో ఎంత పెద్ద మార్కెట్ ఉందో ‘ఆఫ్ క్యాంపస్’ మరోసారి నిరూపించింది.
Follow Us