'దేవర' సక్సెస్ పై ఎన్టీఆర్ ఎమోషనల్.. వైరలవుతున్న పోస్ట్

NTR 'దేవర' ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా NTR ఎక్స్ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు.

New Update

Ntr Devara: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దేవర'  సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత తారక్ సోలోగా..  భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.  అంచనాలకు తగ్గట్లే జూనియర్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సందర్భంగా తారక్ సినీ ప్రియులకు, అభిమానులకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 

తారక్ కృతజ్ఞతలు 

దేవర పార్ట్ 1'కి అందుతున్న అద్భుతమైన స్పందనకు  హృదయపూర్వక కృతజ్ఞతలని తెలిపారు. ఈ సినిమా ఎప్పటికీ  తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుందని చెప్పారు. దర్శకుడు కొరటాల శివకు ధన్యవాదాలని. ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైందని తెలిపారు. అనిరుధ్ అద్భుతమైన సంగీతం ఇచ్చారని. ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు.  

ఎన్టీఆర్ ఎక్స్ పోస్ట్ 

"దేవర పార్ట్ 1'కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది.

నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు మరియు ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు.

నా దర్శకుడు కొరటాల శివ గారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫి, సాబు సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు.

మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు మరియు థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు.

మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని గారు మరియు హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్టును విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు.

ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

మీరు చూపించే ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎలప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. 'దేవర పార్ట్ 1' చిత్రాన్ని మీ భుజాలపై మోసి, ఇంతటి ఘన విజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు."

 

 

Also Read:  PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా!

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!

ఇది కూడా చదవండి: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్

Advertisment
Advertisment
తాజా కథనాలు