NTR Neel: అందుకే ఎన్టీఆర్ నీల్ సినిమా లేట్ అవుతోంది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న కొత్త సినిమా షూటింగ్ కథలో మార్పుల కారణంగా కొంత ఆలస్యమైంది. ఎన్టీఆర్ హిందీ సినిమా War 2 ఫలితం తర్వాత స్క్రిప్ట్ రివైజ్ చేశారు. ఇప్పుడు షూటింగ్ వేగంగా జరుగుతోంది. టైటిల్, గ్లింప్స్ మే 20న విడుదల కానుంది.

New Update
NTR Neel

NTR Neel

NTR Neel: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా ఎందుకు ఆలస్యం అవుతుందా అని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు దానికి కారణం బయటకు వచ్చింది.

ఈ సినిమాకు మధ్యలో కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ విషయాన్ని Mythri Movie Makers సంస్థ సీఈఓ చెర్రీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ, షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుగుతోందని, ముందుగా చెప్పిన తేదీకి సినిమా పూర్తి చేస్తామని తెలిపారు.

Also Read: పక్కా పల్లెటూరు పిల్లగా అదరకొట్టిన అనుపమ.. శర్వా “భోగి” ఫస్ట్ లుక్ రిలీజ్!

అయితే, ఎన్టీఆర్ నటించిన హిందీ సినిమా "War 2" ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, టీమ్ కొంత సమయం తీసుకుని కథలో మార్పులు చేసిందన్నారు. ఇప్పుడు అన్ని సర్దుకున్నాయని, షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోందని చెప్పారు.

Also Read: “జెట్ లీ”తో మళ్లీ నవ్వులు పూయిస్తాడా? వెన్నెల కిషోర్ రీ-ఎంట్రీపై భారీ హైప్!

ఇది ఒక పెద్ద యాక్షన్ సినిమా. ఈ సినిమాకు టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ మే 20న విడుదల అవుతాయి. సినిమా 2027 జూన్ 11న థియేటర్లలోకి రానుంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ Rukmini Vasanth నటిస్తోంది. సంగీతాన్ని Ravi Basrur అందిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ NTR Arts, మైత్రి మూవీ మేకర్స్ Mythri Movie Makers కలిసి నిర్మిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు