Dragon Glimpse: ఎన్టీఆర్ సంచలనం.. రికార్డ్ వ్యూస్‌తో దుమ్మురేపుతున్న 'డ్రాగన్' గ్లింప్స్!

'డ్రాగన్' గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి భారత్‌లో రికార్డు క్రియేట్ చేసింది. Jr NTR డార్క్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది.

New Update
Dragon Glimpse

Dragon Glimpse


Dragon Glimpse: ఎన్టీఆర్ డ్రాగన్ Dragon సినిమా గ్లింప్స్ భారీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ Prashanth Neel తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో Jr NTR డార్క్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. మే 19, 2026 అర్ధరాత్రి విడుదలైన ఈ గ్లింప్స్‌కు కేవలం 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇది భారత్‌లోనే ఒక రోజులో అత్యధిక వ్యూస్ సాధించిన మూవీ గ్లింప్స్‌గా రికార్డు సృష్టించింది.

ఈ గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎన్టీఆర్ కొత్త అవతార్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోపై భారీ చర్చ జరుగుతోంది.

ఈ పాన్ ఇండియా సినిమాలో రుక్మిణి వసంత్ Rukmini Vasanth, అనిల్ కపూర్ Anil Kapoor, బిజు మీనన్ Biju Menon, ఖుష్బు సుందర్ Khushbu Sundar, గురు సోమసుందరం Guru Somasundaram, రాజీవ్ కనకాల Rajeev Kanakala, అశుతోష్ రాణా Ashutosh Rana వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ భారీ చిత్రాన్ని Mythri Movie Makers, NTR Arts కలిసి నిర్మిస్తున్నాయి. సంగీతం Ravi Basrur అందిస్తున్నారు. Dragon సినిమా జూన్ 11, 2027న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు