/rtv/media/media_files/2024/11/04/aRNfcNeHZcOcQlOunk4T.jpg)
టాలీవుడ్ హీరో నితిన్ రీసెంట్ గా 'ఎక్స్ట్రాడినరీ మ్యాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ రైటర్ కం డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ డ్రామాగా విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. ఆ సినిమా షూటింగ్స్ కూడా దాదాపు చివరి దశకు వచ్చేసాయి.
'వకీల్ సాబ్' మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 'తమ్ముడు ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. '2025 మహా శివరాత్రి సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ సరికొత్త పోస్టర్ వదిలారు.
Also Read : ఎట్టకేలకు బయటికొచ్చిన హర్షసాయి.. కేసుపై ఏమన్నాడంటే!?
His Remarkable 𝐑𝐄𝐒𝐈𝐋𝐈𝐄𝐍𝐂𝐄🔥
— Sri Venkateswara Creations (@SVC_official) November 4, 2024
His Massive 𝐏𝐎𝐖𝐄𝐑💥
Make Way for a New Brother in Town @actor_nithiin 😎#Thammudu Arriving on Maha Shivaratri - 2025 with a Powerful Tale of Courage and Ambition🔱❤️🔥#ThammuduForShivaratri
A Film by #SriramVenu#DilRaju… pic.twitter.com/RdL3etjOxv
అంచనాలు పెంచేలా పోస్టర్..
పోస్టర్ లో నితిన్ ఓ చిన్న పాపని భుజంపై ఎక్కించుకొని చేతిలో వెలుగుతున్న కాగడా పట్టుకొని, వెనకాల కొంతమంది తరుముతుంటే పరిగెడుతున్నట్టు ఉంది. ఈ పోస్టర్ కాస్త సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటి మెంట్ తో రాబోతున్న ఈ చిత్రంలో నితిన్ కు అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయ నటిస్తుంది.తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.