/rtv/media/media_files/2026/04/16/swayambhu-first-single-2026-04-16-21-01-46.jpg)
Swayambhu First Single
Swayambhu First Single: పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా ‘స్వయంభూ’ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ‘రా రా ధీవరా’ అనే ఈ పాట విడుదలైన మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. భారీ పీరియడ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారత కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ పాటకు రవి బస్రూర్ సంగీతం అందించారు. పవర్‌ఫుల్ బీట్‌లతో, భారీ సౌండ్‌తో ఈ సాంగ్ వినిపిస్తోంది. సంతోష్ వెంకీ పాడిన ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు హీరో పాత్ర వీరత్వాన్ని చూపిస్తున్నాయి.
ఈ సాంగ్‌లో నిఖిల్ కొత్త లుక్‌లో కనిపించాడు. యోధుడిలా స్ట్రాంగ్‌గా, యాక్షన్ సీన్స్‌లో డ్యూయల్ స్వోర్డ్ ఫైట్స్‌తో ఆకట్టుకున్నాడు. దీని కోసం ఆయన చాలా రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే డాన్స్ కూడా ఎనర్జీతో చేశారు. హీరోయిన్ నభా నటేష్ కూడా ఈ పాటలో కనిపించి మరింత ఆకర్షణ పెంచింది.
సినిమాలో భారీ సెట్లు, యుద్ధ సన్నివేశాలు, వందల మంది ఆర్టిస్టులతో తీసిన సీన్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొరియోగ్రాఫర్ బిన్నీ మాస్టర్ ఈ పాటను యాక్షన్, డాన్స్ కలిపి స్టైలిష్‌గా రూపొందించారు.
Lenin Second Single
ఇక మరోవైపు అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘యెట్ట యెట్ట’ అనే ఈ సాంగ్ ఇప్పటికే యూత్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ బాగా కనిపిస్తోంది.
తమన్ సంగీతం అందించిన ఈ పాట బీట్‌లు చాలా క్యాచీగా ఉన్నాయి. తమన్ తో పాటు శ్రీకృష్ణ ఈ పాటను పాడారు. భాస్కరభట్ల రాసిన లిరిక్స్ సింపుల్‌గా, వినడానికి ఆకట్టుకునేలా ఉన్నాయి.
‘లెనిన్’ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎమోషన్స్, యాక్షన్‌తో పాటు పూర్తి ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. జూన్ 26, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థియేటర్ అనుభవం ఇస్తుందని టీమ్ చెబుతోంది.
మొత్తానికి ‘స్వయంభూ’ ఫస్ట్ సాంగ్, ‘లెనిన్’ సెకండ్ సాంగ్ రెండూ విడుదలై సినిమాలపై అంచనాలను మరింత పెంచేశాయి.
Follow Us