NBK111 Glimpse: ఫ్యాన్స్ వెయిటింగ్.. NBK111 గ్లింప్స్‌ వచ్చేది అప్పుడే!

బాలకృష్ణ నటిస్తున్న NBK111 సినిమా గ్లింప్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా సాయంత్రం 5:40కి విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య కొత్త లుక్‌లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్, నయనతార హీరోయిన్లు కాగా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

New Update
NBK111 Glimpse

NBK111 Glimpse

NBK111 Glimpse: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఆయన నటిస్తున్న కొత్త సినిమా NBK111 నుంచి వచ్చే గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లు, కౌంట్‌డౌన్ అప్‌డేట్స్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి.

మేకర్స్ ఇప్పటికే ఈ గ్లింప్స్‌లో బాలయ్యను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించబోతున్నారని చెప్పారు. “వింటేజ్ కాదు… పూర్తిగా కొత్త స్టైల్” అని ఇచ్చిన ట్యాగ్‌లైన్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచింది.

ఇక ఈ రోజు ప్రత్యేకంగా విడుదల కాబోతున్న ఈ గ్లింప్స్ సాయంత్రం 5:40 గంటలకు రిలీజ్ కానుంది. దీంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్, నయనతార నటిస్తున్నారు. విలన్ పాత్రలో మంచు మనోజ్ కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.

మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ పని చేస్తున్నారు. ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చిందని సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు