నయనతార ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా? అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్ నయనతార ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నాకు చాలా ఇష్టమైన కనుబొమ్మల షేప్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను. అందుకే నా ముఖం కాస్త మారినట్లు అనిపిస్తుంది తప్ప నా బాడీలో ఎక్కడ ప్లాస్టిక్ ఉండదు అని చెప్పారు. By Anil Kumar 28 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి సౌత్ సినీ ఇండస్ట్రీలో భారీ స్టార్ డం తో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. కోలీవుడ్ కు చెందిన ఈ హీరోయిన్ చాలా తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మన టాలీవుడ్ లోనూ అగ్ర హీరోల సరసన జతకట్టి ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా 'జవాన్' మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. అయితే కెరీర్ స్టార్టింగ్ లో నయనతార ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో వీటిపై వివరణ ఇచ్చింది.' నాకు కనుబొమ్మలు అంటే చాలా ఇష్టం. వాటి షేప్ ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఎంతో సమయాన్ని దానికోసం పెడతాను. కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా నా ముఖం కాస్త మారినట్లు అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో ప్రజలు అలా అనుకుంటున్నారు. ఇది కూడా చూడండి: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా డైటింగ్ వల్లే ముఖంలో మార్పులు.. అయితే వాళ్లు మాట్లాడుకునేది నిజం కాదు. డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావొచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తాయి. మరోసారి అవి లోపలికి పోయినట్లు అనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు. నా బాడీలో ఎక్కడ ప్లాస్టిక్ ఉండదు..' అని చెప్పుకొచ్చింది. దీంతో నయన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నయనతార ప్రస్తుతం తమిళ్, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గత ఏడాది మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ హీరోయిన్ ఈ ఏడాది మొత్తం ఐదు సినిమాలు చేస్తోంది. Also Read: Venkatesh: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే? View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) #nayanthara #actress-nayanthara మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి