/rtv/media/media_files/2025/04/14/rfJgYhn4A0ThsfdbVzK4.jpg)
HIT 3 Trailer
HIT 3 Trailer: పాపులర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'హిట్' యూనివర్స్ నుంచి కొత్తగా వస్తున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT 3). ఈసారి నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . ఈ సినిమాకి ‘హిట్’ సిరీస్‌ను ప్రారంభించిన డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. కథానాయికగా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది.
అర్జున్ సర్కార్ గా నాని పవర్‌ఫుల్ పోలీస్ రోల్
ఈ చిత్రంలో నాని ఒక పోలీస్ అధికారిగా, అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ని బట్టి సినిమా నిండా సస్పెన్స్, సీరియల్ మర్డర్స్, ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగనుందని స్పష్టంగా తెలుస్తోంది.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
ట్రైలర్ టాక్: నాని డైలాగ్స్ & మేకింగ్ హైలైట్
ట్రైలర్‌లో నాని బాడీ లాంగ్వేజ్, పవర్‌పుల్ డైలాగ్స్, గ్రిప్పింగ్ నేపథ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గతంలోని ‘హిట్ 1’ & ‘హిట్ 2’ కన్నా ఈ మూడో భాగం చాలా ఇంటెన్స్, డార్క్ & వైల్డ్గా ఉండబోతుందని తాజాగా రిలీజైనా ట్రైలర్ చుస్తే అర్థమవుతోంది.
Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!
వేసవి కానుకగా మే 1న థియేటర్లలోకి
పవర్‌ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా, వేసవి కానుకగా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వరుస హత్యలు, క్లూస్ వెతకడం, విచిత్ర మలుపులతో ఈ సారి HIT 3 ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది.
Also Read: మలేషియాలో ప్రదీప్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'..