Balakrishna - Koratala Siva: గ్యాంగ్‌స్టర్‌ గా బాలయ్య.. కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా!

నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని సినిమా తర్వాత కొరటాల శివతో కొత్త సినిమా చేయనున్నారు. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో సోషల్ డ్రామాగా తెరకెక్కనుంది. షూటింగ్ వేగంగా పూర్తి చేసి సంక్రాంతి 2027కి విడుదల చేయాలనీ మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

New Update
Balakrishna - Koratala Siva

Balakrishna - Koratala Siva

Balakrishna - Koratala Siva: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపిచంద్ మలినేని‌తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా సమయంలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా చర్చలు సాగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ త్వరలో దర్శకుడు కొరటాల శివతో కలిసి పని చేయనున్నారు. ఇటీవల ‘దేవర’తో మంచి విజయాన్ని అందుకున్న కొరటాల శివ, ఈసారి కూడా బలమైన సందేశంతో కూడిన సోషల్ డ్రామాను తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా పెద్దగా విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడకుండా, సింపుల్‌గా, కథకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉండనుందని తెలుస్తోంది.

Also Read: ప్రభాస్ 'కల్కి' సీక్వెల్ లో తమిళ్ స్టార్ హీరో..!

మొదట బాలకృష్ణ హరీష్ శంకర్, విజయ్ కనకమేడల వంటి దర్శకులతో కూడా చర్చలు జరిపినా అవి ఫైనల్ కాలేదు. చివరికి కొరటాల శివ కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కథ వినగానే వెంటనే షూటింగ్ ప్రారంభించాలని బాలకృష్ణ ఆసక్తి చూపినట్టు సమాచారం.

ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉండనుందని టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ అంశాలతో పాటు మంచి మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉండనుంది.

బాలకృష్ణ ఎప్పటిలాగే పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో షూటింగ్ వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు, గోపిచంద్ మలినేని సినిమా ఆలస్యం అయితే అది కూడా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ప్లానింగ్‌లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది.

మొత్తానికి, బాలకృష్ణ-కొరటాల శివ కాంబినేషన్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా సమయానికి పూర్తి అయితే సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మంచి పోటీని ఇచ్చే అవకాశముంది.

Advertisment
తాజా కథనాలు